World bank: భారత్‌లో త‌గ్గిన‌ పేదరికం: ప్రపంచ బ్యాంకు నివేదిక

Published : Apr 18, 2022, 06:55 AM IST
World bank: భారత్‌లో త‌గ్గిన‌ పేదరికం: ప్రపంచ బ్యాంకు నివేదిక

సారాంశం

World bank: భారతదేశంలో పేదరికం గ‌ణ‌నీయ స్థాయిలో తగ్గిందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. 2011తో పోలిస్తే.. 2019లో పేదరికం భారీగా తగ్గినట్లు పేర్కొంది. తొమ్మిదేళ్లలో ఏకంగా 12.3 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద‌రికం గణనీయంగా తగ్గిన‌ట్టు తెలిపింది.  

World bank: భారతదేశంలో పేదరికం గ‌ణ‌నీయ స్థాయిలో తగ్గిందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. 2011తో పోలిస్తే.. 2019లో పేదరికం భారీగా తగ్గినట్లు పేర్కొంది. గ‌త తొమ్మిదేళ్లలో ఏకంగా 12.3 శాతం మేర పేద‌రికం తగ్గినట్లు వెల్ల‌డించింది. ఈ నివేదిక ప్ర‌కారం.. 2011లో 22.5 శాతం మంది పేదరికంలో ఉండేవారని, అదే.. 2019 నాటికి 10.2 శాతానికి తగ్గిందని తెలిపింది. ప్ర‌ధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గ‌ణ‌నీయంగా తగ్గినట్లు పేర్కొంది. గ్రామీణ పేదరికం 2011లో 26.3% నుండి 2019లో 11.6%కి తగ్గింది, అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో 14.2% నుండి 6.3%కి తగ్గుదల క‌నబ‌రించింది. మొత్తంగా చూస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గింపు అత్యధికంగా ఉంది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ఇదే విధంగా చెప్పిన సంగతి తెలిసిందే.
  
గ్రామీణ పేదరికం 2011లో 26.3 శాతం నుండి 2019లో 11.6 శాతానికి దిగ‌జారిన‌ట్టు తెలిపింది.  అదే స‌మ‌యంలో పట్టణ ప్రాంతాల్లో 14.2 శాతం నుండి 6.3 శాతానికి తగ్గిందని ప్రపంచ బ్యాంక్ పేపర్ తెలిపింది. పట్టణ భారతదేశంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల ఎక్కువగా ఉందని వివ‌రించింది. 2011-2019 మ‌ధ్య కాలంలో గ్రామీణ, పట్టణ పేదరికం 14.7, 7.9 శాతం తగ్గాయని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది.  ఈ నివేదిక‌ను ఆర్థికవేత్తలు సుతీర్థ సిన్హా రాయ్ మరియు రాయ్ వాన్ డెర్ వీడే రూపొందించారు.

ప్రపంచ బ్యాంక్ పాలసీ రీసెర్చ్ వర్కింగ్ రిపోర్టు ప్ర‌కారం... అభివృద్ధిపై ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడం, పురోగతిలో ఉన్న పరిశోధన యొక్క ఫలితాలను త్వరగా వ్యాప్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2013, 2019లో చేసిన సర్వేల ప్రకారం.. చిన్న కమతాలు కలిగిన రైతుల ఆదాయంలో పెరుగుద‌ల క‌నిపించిన‌ట్టు పేర్కొంది. అతి చిన్న భూస్వాములు కలిగిన రైతుల వాస్తవ ఆదాయాలు (2013, 2019) మధ్య వార్షిక పరంగా 10 శాతం ఆదాయం పెరిగింది. ఇదే స‌మయంలో పెద్ద రైతుల ఆదాయంలో కేవ‌లం 2 శాతం వృద్ధి క‌న‌ప‌రించిన‌ట్టు పేర్కొంది.

భారతదేశానికి ఇటీవలి కాలాల గురించి అధికారిక అంచనా లేనందున ప్రపంచ బ్యాంకు యొక్క పత్రం ముఖ్యమైనది. జాతీయ నమూనా సర్వే సంస్థ (NSSO) ద్వారా చివరి వ్యయ సర్వే 2011లో విడుదల చేయబడింది.  పేదరికం, అసమానతలకు సంబంధించిన అధికారిక అంచనాలను కూడా విడుదల చేసింది. ఓ ప్రైవేట్ డేటా కంపెనీ నిర్వహించిన కన్స్యూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే అనే కొత్త గృహ ప్యానెల్ సర్వేను ఉపయోగించి 2011 నుండి పేదరికం, అసమానతలు ఎలా అభివృద్ధి చెందాయి అనే దానిపై నివేదిక‌లను రూపొందించారు.

డేటా నాణ్యత సమస్యల దృష్ట్యా.. నవంబర్ 2019లో గణాంకాలు మరియు ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ (MOSPI) 2017-18 వినియోగదారుల వ్యయ సర్వే ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. చివరిగా  2015-2019 మధ్య పేదరికం తగ్గింపు అంతకుముందు అంచనాల కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే