బిగ్ బ్రేకింగ్.. ఉక్రెయిన్‌లో కాల్పులకు తాత్కాలిక విరామం ప్రకటించిన రష్యా..

Published : Mar 05, 2022, 12:17 PM ISTUpdated : Mar 05, 2022, 12:45 PM IST
బిగ్ బ్రేకింగ్.. ఉక్రెయిన్‌లో కాల్పులకు తాత్కాలిక విరామం ప్రకటించిన రష్యా..

సారాంశం

ఉక్రెయిన్‌-రష్యా యుద్దంలో కీలక పరిణామాం చోటుచేసుకుంది. గత 10 రోజులుగా ఉక్రెయిన్‌పై భీకరమన దాడులు కొనసాగిస్తున్న రష్యా.. తాత్కాలికంగా యుద్దానికి  బ్రేక్ వేసింది. మనవతా కారిడార్ కోసం వోల్నావఖా, మరియుపోల్‌లో కాల్పుల విరమణను ప్రకటించింది

ఉక్రెయిన్‌-రష్యా యుద్దంలో కీలక పరిణామాం చోటుచేసుకుంది. గత 10 రోజులుగా ఉక్రెయిన్‌పై భీకరమన దాడులు కొనసాగిస్తున్న రష్యా.. తాత్కాలికంగా యుద్దానికి  బ్రేక్ వేసింది. మనవతా కారిడార్ కోసం వోల్నావఖా, మరియుపోల్‌లో కాల్పుల విరమణను ప్రకటించింది. ఈ రెండు నగరాలను రష్యా సేనలు ఇప్పటికే ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడి పౌరుల తరలింపు కోసం కాల్పులను తాత్కాలికంగా  విరమిస్తున్నట్టుగా Russian defence ministry ప్రకటించింది. మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి కాల్పులను నిలిపివేయనుంది. ఈ మేరకు రష్యా ప్రభుత్వానికి చెందిన Sputnik న్యూస్ ఏజెన్సీ వివరాలు వెల్లడించింది.

ఉక్రెయిన్‌లోని విదేశీయుల తరలింపు కోసం రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఇటీవల రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరిగిన రెండో వితడ చర్చల్లో మానవతా కారిడార్లు ఏర్పాటుకు ఇరు దేశాలు అంగీకరించి సంగతి తెలిసిందే. రష్యా తాజాగా తాత్కాలికంగా కాల్పుల విరమణ చేపట్టడం ద్వారా.. ఆ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విదేశీయుల తరలింపుకు మార్గం సుగమం కానుంది. వారు పశ్చిమ ప్రాంతం వైపు వెళ్లేందుకు అవకాశం కల్పించినట్టయింది. 

ఇక, ఉక్రెయిన్‌ (Ukraine) పై ర‌ష్యా (Russia) దాడులు చేయ‌డం మొద‌లు పెట్టి ప‌దిరోజులు అవుతోంది. ఉక్రెయిన్ రాజ‌ధాని కైవ్ న‌గ‌రంతో పాటు ఆ దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌పై  రష్యా దాడులు కొనసాగుతున్నాయి. వ్యూహాత్మ‌క‌మైన ప్ర‌ధాన ప్రాంతాల‌ను త‌మ అదుపులోకి తీసుకుంటూ ర‌ష్యా బ‌ల‌గాలు దాడులు కొన‌సాగిస్తున్నాయి. ఇప్పటికే ఖేర్సన్‌ నగరంతో అణువిద్యుత్‌ కేంద్రాలైన చెర్నోబిల్‌, జపోరిజియా పవర్‌ ప్లాంట్‌ను తమ ఆధీనంలో తీసుకున్న రష్యా (Russia)..  ప్ర‌స్తుతం కీల‌క‌మైన పోర్టు సిటీ మరియుపోల్‌ను (Mariupol) రష్యా (Russia) బలగాలు చుట్టుముట్టాయని నగర మేయర్‌ తెలిపారు.

ఇక, మానవతా సమస్యలకు పరిష్కారాలను వెతుకుతున్నాము.మారియుపోల్‌ను దిగ్బంధనం నుండి బయటపడేసేందుకు సాధ్యమైన అన్ని మార్గాలను వెతుకుతున్నామని  నగర మేయర్ బాయ్చెంకో (Vadym Boychenko) చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే