Russia Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో స్వదేశానికి చైనీయులు !

Published : Mar 05, 2022, 11:26 AM IST
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో స్వదేశానికి  చైనీయులు !

సారాంశం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగిస్తూ.. విధ్వంసం సృష్టిస్తోంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ చిక్కుకుపోయిన త‌మ దేశ పౌరుల‌ను ఆయా దేశాలు ప్ర‌త్యేక విమానాల్లో స్వ‌దేశానికి తీసుకువ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చైనా త‌న పౌరుల‌ను స్వదేశానికి తీసుకురావడానికి ప్ర‌త్యేక చార్ట‌ర్డ్ ఫ్లైట్ లను నడుపుతోంది.

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. పుతిన్ ఆదేశాల‌తో మ‌రింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ చిక్కుకుపోయిన త‌మ దేశ పౌరుల‌ను ఆయా దేశాలు ప్ర‌త్యేక విమానాల్లో స్వ‌దేశానికి తీసుకువ‌స్తున్నాయి. తాగజాగా  చైనా త‌న పౌరుల‌ను ప్ర‌త్యేక చార్ట‌ర్డ్ ఫ్లైట్ లో తీసుకువ‌చ్చింది. ఉక్రెయిన్ నుంచి వ‌చ్చిన‌ చైనీస్ విద్యార్థులు మరియు ఆ దేశ పౌరుల‌తో కూడిన చార్టర్డ్ విమానం శనివారం తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ రాజధాని హాంగ్‌జౌలో ల్యాండ్ అయింది. 3,000 కంటే ఎక్కువ మంది చైనా పౌరులను సురక్షితంగా ఉక్రెయిన్ నుండి పొరుగు దేశాలకు తరలించిన తర్వాత చైనా జాతీయులను తరలించడానికి చైనా పంపిన చార్టర్డ్ విమానాల శ్రేణిలో ఇది మొదటిది.

గ్లోబల్ టైమ్స్ పేర్కొన్న వివ‌రాల ప్రకారం.. ఉక్రెయిన్ లోకి చిక్కుకుపోయిన చైనా పౌరుల‌తో కూడిన‌ ఫ్లైట్ CA702 శుక్రవారం 20:08 (బీజింగ్ సమయం)కి రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి బయలుదేరింది. విమానం 48 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. మరో విమానం శనివారం ఉదయం 10:15 గంటలకు సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌జౌలో ల్యాండ్ అవుతుందని భావిస్తున్నారు. రెండు విమానాలను ఎయిర్ చైనా నిర్వహిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఎయిర్ చైనా చార్టర్ విమానాలు గరిష్టంగా 301 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో Airbus A330-300 విమానాలను ఉపయోగిస్తాయి.

ఉక్రెయిన్‌లో చదువుతున్న ఇద్దరు చైనా విద్యార్థులు చైనాకు తిరిగి వచ్చిన వారిలో మొదటివారు. తమ ఇటీవల ఎదుర్కొన్న ప‌రిస్థితుల గురించి మాట్లాడుతూ.. అంతా కలలా ఉందని ఫ్లైట్ ఎక్కే ముందు అన్నారు. చైనా ప్ర‌భుత్వ యంత్రాంగానికి, చైనా రాయబార కార్యాలయంతో పాటు తమకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. "మేము శాంతిని కోరుకుంటున్నాము మరియు ఇకపై యుద్ధం వద్దు" అని చైనా పౌరులు పేర్కొన్నారు. కాగా, ర‌ష్యా హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఉక్రెయిన్ లోని చైనా పౌరులంద‌రూ గురువారం మధ్యాహ్నం నాటికి ఉక్రెయిన్ నుండి ఖాళీ చేయబడ్డారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఖార్కివ్‌లోని 180 మంది చైనీస్ విద్యార్థుల తరలింపు కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిందని మీడియా పేర్కొంది. రెండు విమానాలతో పాటు, శని, ఆదివారం మరో నాలుగు చార్టర్డ్ విమానాలు రొమేనియా నుంచి భారీ సంఖ్య‌లో చైనా పౌరుల‌ను తీసుకురానున్నాయి. 

ఈ రెండు విమానాలు చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ద్వారా నిర్వహించబడతాయి. శనివారం టేకాఫ్ అవుతాయి అని చైనా మీడియా పేర్కొంది. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని లాన్‌జౌ మరియు తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జినాన్‌లో ల్యాండ్ అవుతాయి. అలాగే, ఆదివారం నాడు మ‌రో రెండు విమానాలను హాంగ్‌జౌ మరియు జినాన్‌లలో ల్యాండింగ్ చేసే హైనాన్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తుంది. కాగా, భారత్  ఇప్పటికే ఆపరేషన్ గంగా ను నిర్వహిస్తూ.. వేలాది మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి తీసుకువచ్చింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే