Russia Ukraine Crisis: 3500 మంది ర‌ష్యన్ సైనికులు మృతి.. బందీలుగా మరికొంత మంది.. : ఉక్రెయిన్

Published : Feb 26, 2022, 01:16 PM IST
Russia Ukraine Crisis: 3500 మంది ర‌ష్యన్ సైనికులు మృతి.. బందీలుగా మరికొంత మంది.. : ఉక్రెయిన్

సారాంశం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3500 మంది ర‌ష్యన్ సైనికుల‌ను ఉక్రెయిన్ బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయ‌ని ఆ దేశ అధ్య‌క్ష కార్యాల‌య అధికారి పేర్కొన్నారు. అలాగే, మ‌రో 200 మంది ర‌ష్యా సైనికులు ప‌ట్టుబ‌డ్డార‌ని తెలిపారు. 

North Atlantic Treaty Organization: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాల‌ని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. అయితే, ఇప్ప‌టికే రష్యా ఉక్రెయిన్ లోని  పెద్ద సంఖ్యలో సైనిక స్థావ‌రాల‌ను ధ్వంసం చేయ‌డంతో పాటు సైనిక‌ బ‌ల‌గాలు కీవ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించాయి. ర‌ష్యా మొద‌లు పెట్టిన ఈ మిలిట‌రీ చ‌ర్య కార‌ణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణ‌న‌ష్టం జ‌రిగింద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లో మ‌ర‌ణాలు, ఆర్థిక న‌ష్టం తీవ్రత పెరుగుతున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3500 మంది ర‌ష్యన్ సైనికుల‌ను ఉక్రెయిన్ బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయ‌ని ఆ దేశ అధ్య‌క్ష కార్యాల‌య అధికారి పేర్కొన్నారు. అలాగే, మ‌రో 200 మంది ర‌ష్యా సైనికులు ప‌ట్టుబ‌డ్డార‌ని తెలిపారు. 

ఉక్రెయిన్‌పై దాడికి దిగిన ర‌ష్యాకు కూడా భారీ న‌ష్టమే జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 3500 మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయిన‌ట్లు ఉక్రెయిన్ బ‌ల‌గాలు త‌మ‌ ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నాయి. అలాగే, మ‌రో 200 మంది ర‌ష్యా సైనికుల్ని బందించిన‌ట్టు తెలిపింది. దీనికి తోడు 14 విమానాల‌ను, 8 హెలికాప్ట‌ర్ల‌ను, 102 యుద్ధ ట్యాంక్‌ల‌ను కూడా ర‌ష్యా కోల్పోయిన‌ట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. ర‌ష్యా సైనిక చ‌ర్య‌కు ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తున్న‌ద‌నీ, తగిన విధంగా ర‌ష్యాకు జ‌వాబు చెబుతున్న‌ద‌ని ఉక్రెయిన్ అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. దేశాన్ని ఎలా ర‌క్షించుకోవాలో ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని వెల్ల‌డించాయి. ఉక్రెయిన్ లోనూ భారీగానే మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని స‌మాచారం. 

ఇప్ప‌టికీ ఉక్రెయిన్‌పై  ర‌ష్యా మిస్సైళ్ల వ‌ర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో వైమానిక దాడులు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే శ‌నివారం నాడు ఉక్రెయిన్ దాడిపై స్పందించిన రష్యా.. ఇప్ప‌టివ‌ర‌కు ఉప్రెయిన్ లోని 118 సైనిక స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్టు ప్ర‌క‌టించింది. వాటిలో పదకొండు మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్‌లు, 13 కమాండ్ పోస్ట్‌లు, ఉక్రేనియన్ సాయుధ దళాల కమ్యూనికేషన్ సెంటర్లు, 14 S-300, ఓసా యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థలు, 36 రాడార్ స్టేషన్లు ఉన్నాయ‌ని  రష్యా ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. అలాగే, ఉక్రెయిన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్, ఐదు డ్రోన్‌లు కూల్చివేయబడ్డాయ‌నీ, ఇప్పటివరకు డజన్ల కొద్దీ వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. 

అలాగే, కొనాషెంకోవ్ చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్.. రష్యన్ నియంత్రణను ధృవీకరించింది. రెండు వైపుల సైనికులు విద్యుత్ యూనిట్లు మరియు సార్కోఫాగస్‌ను సంయుక్తంగా రక్షించడానికి అంగీకరించాయ‌ని ర‌ష్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. అణు విద్యుత్ ప్లాంట్ ప్రాంతంలో రేడియోధార్మిక సాధారణంగానే ఉంద‌ని తెలిపింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు రష్యా సాయుధ బలగాలను "ఉక్రేనియన్ దళాలతో గౌరవప్రదంగా ప్రవర్తించాలనీ, ఆయుధాలు విడిచిపెట్టిన సైనికుల కోసం భద్రతా కారిడార్‌లను రూపొందించాలని" ఆదేశించారు.  ఉక్రెయిన్‌-ర‌ష్యా దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా పెద్ద మొత్తంలో ప్రాణ‌, ఆర్థిక న‌ష్టం జ‌రుగుతున్న‌ద‌ని ప‌లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి. యుద్ధం ఆపాల‌ని చాలా దేశాలు కోరుతున్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే