
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దళాలు భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ.. బాంబుల వర్షాన్ని కురుపిస్తున్నాయి. సైనిక దాడులు, బాంబుల దాడి మోత, వైమానిక దాడులు మోగుతున్న సైరన్ల మధ్య రాజధాని కీవ్ నగరం చిగురుటాకులా వణికిపోతుంది.
యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచదేశాలు కోరుతున్నా..రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఏ మాత్రం తగ్గడం లేదు. యుద్ధ ట్యాంకర్లు నగరంపై దాడి చేస్తుంటే.. ఉక్రెయిన్ సైన్యం గెరిల్లా యుద్దం చేస్తూ.. రష్యా బలగాలను నిలువరిస్తున్నాయి. ఏ క్షణంగా ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియా దిగ్గజ ఫేస్ బుక్ (Facebook) రష్యాకు షాక్ ఇచ్చింది. ఫేక్ బుక్ వేదికపై రష్యన్ స్టేట్ మీడియా ప్రకటనలను నిషేధించింది. ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిరంతరం గమనిస్తుంటామని తెలిపింది. ఫేస్‌బుక్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నథనియెల్ గ్లెయిచెర్ ఓ ట్వీట్‌లో శనివారం ఈ వివరాలను వెల్లడించారు.
రష్యా తన ప్లాట్‌ఫారమ్‌లలో ఫ్యాక్ట్ చెకర్స్, కంటెంట్ వార్నింగ్ లేబుల్‌లను ఉపయోగించడం మానేయాలని అధికారుల ఆదేశాలను తిరస్కరించిన తర్వాత రష్యా తన సేవలను ఆంక్షలతో దెబ్బతీస్తుందని ఫేస్‌బుక్ యొక్క మాతృ సంస్థ మెటా తెలిపింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా..
రష్యన్ స్టేట్ మీడియా ప్రచారాన్ని Facebook పరిమితం చేసింది.
ప్రపంచంలో ఎక్కడైనా Facebook ప్లాట్‌ఫారమ్‌పై రష్యన్ స్టేట్ మీడియా అడ్వర్టయిజ్‌మెంట్లు చేయడం లేదా, కంటెంట్‌ను మానెటైజింగ్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ఫేస్‌బుక్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నథనియెల్ గ్లెయిచెర్ తెలిపారు. ఈ కొత్త ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయని ఆయన తెలిపారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో భాగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.
రష్యన్ స్టేట్ మీడియాకు లేబుల్స్‌ను వేయడం కొనసాగిస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌లో రష్యన్ స్టేట్ మీడియా అడ్వర్టయిజ్‌మెంట్లు పోస్టు చేయలేరని తెలిపారు. ఈ వారాంతం ఈ పరిస్థితి కొనసాగుతోందని తెలిపారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రికత పరిస్థితులను అనునిత్యం క్షుణంగా గమనిస్తుంటామని తెలిపారు.
ఫ్యాక్ట్-చెకర్స్, కంటెంట్ వార్నింగ్ లేబుల్‌లను ఉపయోగించడం మానేయాలని అధికారుల ఆదేశాలను తిరస్కరించిన తరువాత రష్యా తన సేవలను ఆంక్షలతో దెబ్బతీస్తుందని ఫేస్‌బుక్ యొక్క మాతృ సంస్థ మెటా శుక్రవారం ముందు తెలిపింది.
అంతకుముందు ట్విటర్ కూడా ఇదే విధంగా రష్యన్ స్టేట్ మీడియా అడ్వర్లయిజ్‌మెంట్లు, కంటెంట్ మానిటైజింగ్‌పై నిషేధం విధించింది. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో ఉక్రెయిన్, రష్యాలో ట్విట్టర్ తన ప్లాట్‌ఫారమ్‌లపై ప్రకటనల ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రకటనలు వినియోగదారులను క్లిష్టమైన సమాచారం నుండి దూరం చేయగలవని ట్విట్టర్ పేర్కొంది. ఈ ప్రకటనను మూడు భాషలలో పోస్ట్ చేయబడింది (ఇంగ్లీష్, రష్యన్ ఉక్రేనియన్).
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక ఆపరేషన్ మూడో రోజుకు చేరుకోవడంతో Twitter విధానంలో మార్పు వచ్చింది. ఈ క్షిష్ట సమయంలో ప్రజా భద్రత సమాచారం ప్రమాదకరంగా మారిందనీ, ఈ తరుణంలో ఉక్రెయిన్, రష్యాలో ప్రకటనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అని కంపెనీ పేర్కొంది.