
ఉక్రెయిన్ : రష్యా దళాలు శనివారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని నగరం Kyiv లోకి చొచ్చుకు వెళ్ళాయి. దీంతో వీధి పోరాటం మొదలైందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ప్రజలు Shelters, bunkerలలో ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని తెలిపారు. పేలుల్లు జరిగినప్పుడు శిథిలాలు ఎగిరి పడి, దెబ్బలు తగిలే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. గురువారం ఉదయం ప్రారంభమైన యుద్ధం కారణంగా పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. వంతెనలు, భవనాలు, పాఠశాలలు, అపార్ట్మెంట్లు ధ్వంసం అయ్యాయి.
ఇదిలా ఉండగా ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చేసి తనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు Vladimir Putin కోరుకుంటున్నారని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు Volodymyr Zelensky కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. అనేక నగరాలపై దాడులు కొనసాగుతున్నాయి.
ఈ రోజు రాత్రి మనం దృఢంగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ భవిష్యత్తు ఇప్పుడే నిర్ణయం అవుతోందన్నారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అమెరికా ఇచ్చిన ఆఫర్ ను జెలెన్ స్కీ తిరస్కరించారు. యుద్ధం ఉక్రెయిన్ లో జరుగుతోందని, తనకు ఆయుధాలు కావాలని, పలాయనం కోసం మార్గం కాదని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, Russia ముప్పేట దాడితో Ukraine వణుకుతోంది. రెండు రోజులుగా ప్రధాన నగరాలు, సైనిక స్థావరాలని వరుసపెట్టి హస్తగతం చేసుకుంటున్న పుతిన్ సేనలు… ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ రాజధాని kyivను దాదాపు స్వాధీనం చేసుకునే స్థితికి వచ్చేసాయి. ఇక ఏ క్షణంలోనైనా కీవ్ రష్యా సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోవచ్చు. రష్యన్ ట్యాంకర్లు, బలగాలు శుక్రవారం తెల్లవారుజాము సమయానికే శివారు ప్రాంతాలకు చేరుకున్నాయి. కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు, తూటాల వర్షం కురిపించాయి. దాడులు అంతకంతకు భీకరంగా మారి, ప్రాణనష్టం ఎక్కువవుతున్న తరుణంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల మాట వినిపించారు. ఉక్రెయిన్ తో ఉన్నత స్థాయి చర్చలకు సిద్ధమని ప్రకటించారు.
అయితే ఉక్రెయిన్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి, అక్కడ తన పాలనను స్థాపించాలన్నదే పుతిన్ లక్ష్యమని అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను భూమార్గాల్లో రోమేనియా, హంగేరి సరిహద్దులకు తరలించి, అక్కడినుంచి విమానాల్లో తీసుకొచ్చేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ పై దాడుల నేపథ్యంలో రష్యా పై మరిన్ని ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్ లు సిద్ధమవుతున్నాయి. దీంతోపాటు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గి లావ్రోమ్ కు చెందిన ఆస్తులను స్తంభింప చేసేందుకు ఈయూ కసరత్తు చేస్తోంది.
కీవ్ కు ఐదు కిలోమీటర్ల దూరంలోనే…
కీవ్ నగరానికి ఉత్తరాన కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే రాష్ట్ర రాజధానిలోని ప్రభుత్వ క్వార్టర్, కీలక ప్రాంతాలనులక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నాయి. సిటీ సెంటర్ లోని సబ్ స్టేషన్ నుంచి బయటకు రావద్దని, ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నాయని స్థానిక పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ఈ విషయం తెలిసి.. కీవ్ వాసులు గురువారం రాత్రి పొద్దుపోయేవరకు అండర్ గ్రౌండ్ కు వెళ్లి తలదాచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా భూఉపరితలంపై చోటుచేసుకున్న అతిపెద్ద యుద్ధంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు.