russia ukraine crisis : పుతిన్‌కు షాక్.. జూడో ఫెడరేషన్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగింపు

Siva Kodati |  
Published : Feb 27, 2022, 03:59 PM IST
russia ukraine crisis : పుతిన్‌కు షాక్.. జూడో ఫెడరేషన్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగింపు

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి (russia ukraine crisis) నేపథ్యంలో పుతిన్‌ను అడ్డుకునేందుకు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు (putin) పుతిన్‌కు ( International Judo Federation ) అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ షాకిచ్చింది. ఉక్రెయిన్‌పై దాడి చేసిన కారణంగా జూడో ఫెడరేషన్ గౌరవాధ్యక్ష, ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ అంబాసిడర్ పదవుల నుంచి సస్పెండ్ చేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి (russia ukraine crisis) నేపథ్యంలో పుతిన్‌ను అడ్డుకునేందుకు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించాయి ఆయా దేశాలు. దీనితో పాటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, విదేశాంగ మంత్రి లావ్రోవ్‌పై వ్యక్తిగత ఆర్ధిక ఆంక్షలను విధించింది. తాజాగా రష్యా అధ్యక్షుడు (putin) పుతిన్‌కు ( International Judo Federation ) అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ షాకిచ్చింది. ఉక్రెయిన్‌పై దాడి చేసిన కారణంగా జూడో ఫెడరేషన్ గౌరవాధ్యక్ష, ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ అంబాసిడర్ పదవుల నుంచి సస్పెండ్ చేసింది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐజేఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. 

మరోవైపు.. తాము ఉక్రెయిన్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, దొంబాస్ రీజియన్‌లోని డీపీఆర్, ఎల్‌పీఆర్‌ల రక్షణ కోసమే తాము ఈ మిలిటరీ ఆపరేషన్(Military Operation) చేపడుతున్నామని చెప్పింది. అంతేకాదు, ఇటీవలే.. మరో ఆరోపణ కూడా చేసింది. ఉక్రెయిన్ చర్చలు జరపడానికి  సిద్ధంగా లేదని, ఈ ఘర్షణలను పొడిగించాలనే భావిస్తున్నదని మండిపడింది.

సైనిక చర్య ప్రారంభానికి ముందూ చర్చలు జరపాలని, ఆ దారిలోనే ఉద్రిక్తతలు సమసిపోవడానికి కృషి చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. తాము చర్చలకు సిద్ధం అని, చర్చలకు లొకేషన్‌ను రష్యాకే విడిచిపెడుతున్నామని కూడా పేర్కొన్నారు. తాజాగా, ఈ సంక్షోభంపై చర్చించడానికి రష్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే చర్చలకు వేదికగా దాని మిత్ర దేశం బెలారస్‌ను వేదికగా సూచించింది. బెలారస్‌ (Belarus)లోని గోమెల్‌లో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. కానీ, ఈ ఆఫర్‌ను ఉక్రెయిన్ తిరస్కరించింది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పూర్వం బెలారస్‌లో మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. అక్కడి నుంచీ ఉక్రెయిన్‌పై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే తమ దేశంపై దాడులకుగా వేదిగా ఉన్న బెలారస్‌లో శాంతి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా లేని ఉక్రెయిన్ చెబుతున్నది. రష్యాతో తమకు నిజమైన చర్చలు అవసరం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ సలహాదారు వెల్లడించారు. రష్యా మిలిటరీ దాడులపై ఎలాంటి అల్టిమేటమ్‌లు లేకుండా చర్చలు జరగాలని, కానీ, ఇప్పుడు రష్యా ఇచ్చిన శాంతి చర్చల ఆఫర్ కేవలం ప్రాపగండ మాత్రమేనని కొట్టిపారేశారు. ఉక్రెయిన్‌పై అభిప్రాయాలను తప్పుదారి పట్టించాలనే రష్యా ఈ ప్రకటన చేసిందని ఆరోపించారు. బెలారస్‌లో చర్చల కోసం తమ ప్రతినిధులను పంపించామని, ఉక్రెయిన్ అధికారుల కోసం ఎదురుచూస్తున్నామని రష్యా చెప్పడం కేవలం దుష్ప్రచారం కోసమేనని అన్నారు. 

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ (volodymyr zelensky0 కూడా ఈ శాంతి చర్చల ప్రతిపాదనపై స్పందించారు. తమ దేశం రష్యాతో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నదని, కాని, వాటిని బెలారస్‌లో జరపడానికి అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై మూడు రోజులుగా జరుగుతున్న దాడుల్లో బెలారస్ కూడా భాగస్వామ్యం పంచుకున్నదని పేర్కొన్నారు. బెలారస్‌లోని గోమెల్‌కు బదులుగా వార్సా, బ్రాటిస్లావా, ఇస్తాంబుల్, బుడాపెస్ట్, బాకు వంటి నగరాలను ప్రత్యామ్నాయ వేదికలుగా తీసుకుని, అక్కడ చర్చలు జరపాలని సూచించారు. రష్యా సూచించిన బెలారస్‌లో చర్చలను ఉక్రెయిన్ అంగీకరించబోదని, మరే నగరంలోనైనా చర్చలకు సిద్ధమేనని వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే