‘జెలెన్‌స్కీ’తో రహస్యంగా సహజీవనం చేస్తున్న పుతిన్ కూతురు!

Published : May 20, 2022, 02:58 PM ISTUpdated : May 20, 2022, 03:01 PM IST
‘జెలెన్‌స్కీ’తో రహస్యంగా సహజీవనం చేస్తున్న పుతిన్ కూతురు!

సారాంశం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూతురు ఎకతెరీనా.. జర్మనీలో అదీ జెలెన్‌స్కీతో రహస్యంగా సహజీవనం చేస్తున్నట్టు కొన్ని పరిశోధనాత్మక కథనాలు పేర్కొన్నాయి. పశ్చిమ దేశాలపై తండ్రి విరుచుకుపడుతుండగా.. ఆయన కూతురు ఏకంగా జర్మనీలో మకాం పెట్టేసింది. అదీ.. తండ్రీ ఎంతమాత్రం ఇష్టపడని జెలెన్‌స్కీ అనే వ్యక్తితో సహజీవనంలో ఉన్నది.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతూనే ఉన్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ పలుమార్లు నిప్పులు కక్కారు. ఈ రెండు దేశాల మధ్య దూరం పెరుగుతూనే ఉన్నది. తూర్పు ఉక్రెయిన్ తీర నగరం మరియుపోల్‌లో వందలాది మంది ఉక్రెయిన్ జవాన్లను రష్యా నిర్బంధించి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నచ్చని ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారికంగా గుర్తించిన పుతిన్ కూతురు ఎకతెరీనా.. జెలెన్‌స్కీతో రహస్యంగా సహజీవనంలో ఉన్నట్టు పరిశోధానాత్మక కథనాలు వెల్లడించాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు అనుకూలంగా వ్యవహరించే రష్యన్లను ఇటీవలే విమర్శించారు. వారి మెంటాలిటీ వెస్ట్‌దేనని, రష్యా మెంటాలిటీ కాదు.. తమ ప్రజలతో వారు ఉండరు అని విరుచుకుపడ్డారు. అంతేకాదు, వారిని మోసగాళ్లు, పనికిమాలినవారిగా తిట్టిపోశారు. కానీ, జర్మనీ ప్రముఖ పత్రిక డిర్ స్పీగల్, రష్యా స్వతంత్ర మీడియా సంస్థ ఐస్టోరీస్ కథనాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూతురు గురించి కీలక విషయాలు బయటపెట్టాయి. పుతిన్ అంతలా వ్యతిరేకిస్తున్న పశ్చిమ దేశాల్లో ఒకటైన జర్మనీలో ఆయన కూతురు నివాసం ఉంటున్నట్టు తెలిపాయి.

35 ఏళ్ల పుతిన్ కూతురు ఎకతెరీనా  మాజీ ప్రొఫెషనల్ డ్యాన్సర్. ఆమె జర్మనీలో రహస్యంగా ఓ వ్యక్తితో కాపురం ఉంటున్నట్టు ఈ పత్రికలు పేర్కొన్నాయి. ఆ పత్రికలు పుతిన్ కూతురు సహజీవనం ఉంటున్న వ్యక్తి పేరును వెల్లడించాయి. బహుశా పుతిన్‌కు ఆయన పేరు నచ్చి ఉండకపోవచ్చు. 

ఈ రిపోర్టుల ప్రకారం, ఎకతెరీనా 52 ఏళ్ల ఇగోర్ జెలెన్‌స్కీతో సహజీవనంలో ఉన్నది. వారికి రెండేళ్ల పాప కూడా ఉన్నట్టు తెలిసింది. ఇకతెరీనా పార్ట్‌నగర్ ఇగోర్ జెలెన్‌స్కీ ఇంటి పేరు ఇప్పుడు పుతిన్ ప్రత్యర్థి, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీతో పోలి ఉంది. ఇగోర్ ఇంటి పేరు అదే ఉన్నది. ఇగొర్ జెలెన్‌స్కీ ప్రముఖ బ్యాలెట్ ప్రొఫెషనల్ డ్యాన్సర్. మ్యూనిచ్ స్టేట్ బ్యాలెట్ మాజీ డైరెక్టర్‌గా ఈయన సేవలు అందించారు.

2017 నుంచి 2019 మధ్య కాలంలో ఆమె రష్యా నుంచి జర్మనీ రాజధాని మ్యూనిచ్‌కు కనీసం 50 సార్లు రష్యా సీక్రెట్ సర్వీస్ గార్డుల సహకారంతో వెళ్లినట్టు ఈ కథనాలు పేర్కొన్నాయి.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే