ఇదేం బిల్లురా నాయనా.. సింపుల్ గా రూ.1.36 కోట్లు మాత్రమే.. ఇంటర్నెట్ లో వైరల్ గా బిల్ కాపీ..

Published : Nov 19, 2022, 12:17 PM IST
ఇదేం బిల్లురా నాయనా.. సింపుల్ గా రూ.1.36 కోట్లు మాత్రమే.. ఇంటర్నెట్ లో వైరల్ గా బిల్ కాపీ..

సారాంశం

అబుదాబిలోని ఓ రెస్టారెంట్ బిల్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీనికి కారణం ఏంటంటే.. ఆ బిల్లు సింపుల్ గా కోట్లలో ఉండడమే.. 

అబుదాబి : మామూలుగా రెస్టారెంట్ కి వెడితే ఎంత పుష్టిగా తిన్న బిల్లు ఎంత వస్తుంది? మహాఅంటే పదివేలు దాటొచ్చు..  అదే స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని,  ఫుల్ గా ఎంజాయ్ చేస్తే లక్ష  దాటొచ్చు.  కానీ, అబుదాబీలోని  రెస్టారెంట్ లో  భోజనం చేసిన ఓ కస్టమర్ కు వచ్చిన బిల్లు ఎంతో తెలిస్తే..  షాక్ అవ్వడమే కాదు.. మూర్ఛ పోతారు కూడా. ఆ బిల్లు అక్షరాల 6,15,065 దిర్హామ్స్.  అంటే..  మన ఇండియన్ కరెన్సీ లో సుమారు రూ.1.36కోట్లు.  సాల్ట్ బేయ్ గా పాపులర్ అయిన టర్కీష్ చెఫ్ నుస్రత్ గోక్సే రెస్టారెంట్ లోనే ఓ కస్టమర్ కు ఈ బిల్లు వచ్చింది. 

ఈ బిల్లును రెస్టారెంట్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీనికి నుస్రత్ గోక్సే ‘క్వాలిటీ ఎప్పుడూ కాస్ట్ లీ కాదు’ అనే క్యాప్షన్ కూడా జత చేశారు. దీంతో ఇప్పుడు ఈ బిల్లు తాలూకు పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంత బిల్లు అవ్వడానికి కస్టమర్ ఏమైనా బంగారం బిస్కెట్లు ఆర్డర్ చేశాడా? అనేదే కదా మీ డౌటు.. వాటికంటే మించి అంటారు.. ఆ ఐటమ్స్ చూస్తే...

వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఫుట్ బాల్ క్రీడాకారిణి ప్రియ... నలుగురు డాక్టర్లపై కేసు నమోదు...

బిల్లులో ఉన్న చాలా ఖరీదైన ఐటమ్ లలో ఐదు బాటిళ్ల పెట్రస్ ఉంది. దీని విలువ రూ.72.13 లక్షలు. అలాగే 2009కి చెందిన మరో రెండు బాటిళ్ల పెట్రస్ కూడా ఉంది. దీని ఖరీదు రూ.44.38లక్షలు. ఇక బిల్లు తాలూకు వ్యాట్ రూ.6.40లక్షలు. వీటితో పాటు ఇంకా కొన్ని కాస్ట్ లీ ఫుడ్ ఐటెంలతో కలిసి బిల్లు మొత్తంగా రూ.1.36కోట్లు అయింది. అయినా కస్టమర్ దీన్ని హ్యాపీగా పే చేసి వెళ్లినట్లు అబుదాబీలోని అల్ మరియాహ్ ద్వీపంలోని గల్లెరియాలో ఉన్న ఈ రెస్టారెంట్ చెప్పుకొచ్చింది. 

ఇక ‘సాల్ట్ బే’గా పాపులారిటీ సంపాదించిన వరల్డ్ క్లాస్ చెఫ్ నుస్రత్ గోక్సే తాను మాంసాన్ని కట్ చేసే ప్రత్యేకమైన శైలితో పాటు ఆహార పదార్థాలపై అతడు ఉప్పు వేసే ఓ వెరైటీ సిగ్నేచర్ తో ఎంతో ఫేమస్ అయ్యారు. గూగుల్ లో మనం నుస్రెట్ గోక్సే ఫొటోల కోసం సెర్చ్ చేస్తే కూడా ఎక్కువగా అతడు ప్రత్యేకమైన మేనరిజంతో కూడినవే కనిపిస్తాయి. ఈ టర్కిష్ చెఫ్ కు ప్రస్తుతం ఏడు దేశాల్లో లగ్జరీ స్టీక్ హౌస్ లున్నాయి. 

PREV
click me!

Recommended Stories

30 ఏళ్ల త‌ర్వాత కండోమ్‌ల‌పై ప‌న్ను విధించిన ప్ర‌భుత్వం.. కార‌ణం ఏంటంటే?
ప్ర‌పంచంలో జైలు లేని దేశం ఏదో తెలుసా.? అత్యంత సుర‌క్షిత‌మైన ప్ర‌దేశం ఇదే