కొడుకు కోసం... 62కేజీలు బరువు తగ్గిన మహిళ...!

By telugu news teamFirst Published Nov 19, 2022, 10:35 AM IST
Highlights

ఎందుకంటే ఆమె.. ఒకటి , రెండు కేజీలు కాదు... ఏకంగా...62 కేజీల బరువు తగ్గింది. అది కూడా... ఆమె తన కొడుకు కోసం ఇంత బరువు తగ్గడం విశేషం.

బరువు తగ్గాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అందు కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు సక్సెస్ అవుతుంటారు. మరి కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. అలా ఫెయిల్ అయిన వారికి ఎవరినైనా ఇన్సిపిరేషన్ తీసుకుంటే... కచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. అలా ఎవరికైనా బరువు తగ్గడంలో ఇన్సిపిరేషన్ కావాలంటే... ఇదిగో ఈ మహిళను తీసుకోవాలి. ఎందుకంటే ఆమె.. ఒకటి , రెండు కేజీలు కాదు... ఏకంగా...62 కేజీల బరువు తగ్గింది. అది కూడా... ఆమె తన కొడుకు కోసం ఇంత బరువు తగ్గడం విశేషం. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఆమె తన కొడుకు కోసం ఇంత బరువు తగ్గింది. ఆమె కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

వాషింగ్టన్ డీసీ కి చెందిన 25ఏళ్ల మహిళ... ఓ సారి తన భారీ శరీరం కారణంగా.. ఓ స్లైడ్ లో ఇరుక్కుపోయింది. ఆ దృశ్యాన్ని ఆమె కుమారుడు  చూశాడు. ఆమెను బయటకు లాగేందుకు ఆమె భర్త ప్రయత్నించాడు. అతని సహాయంతోనే ఆమె అందులో నుంచి బయటపడింది. ఆ సమయంలో ఆమె దాదాపు 114 కేజీల బరువు ఉంది.అయితే.. తనని అలా కొడుకు చూడటం ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. తాను లావుగా ఉండటం వల్లనే ఇలా జరిగింది కదా అని ఆమె భావించింది. ఆమె అలా ఇరుక్కుపోవడం చూసి ఆమె కుమారుడు భయపడిపోయాడట. అప్పుడే.. తాను బరువు తగ్గాలి అని ఆమె నిర్ణయం తీసుకుంది.

 

నిజానికి ఆమె మొదట్లో అంత బరువు ఉండేది కాదట. ప్రెగ్నెన్సీ సమయంలో ఆమెకు జరిగిన సర్జరీల కారణంగా అంత బరువు పెరిగిపోయిందట. అయితే.. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆమె బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నారు. తన డైట్ లో మార్పులు చేసుకున్నారు. రోజుకి 3వేల క్యాలరీలు బర్న్ చేయడం మొదలుపెట్టిందట. డైట్ లో మార్పులు, వర్కౌట్స్ చేయడం మొదలుపెట్టింది.ఆ సమయంలోనూ ఆమెకు పీసీఓఎస్ వచ్చిందట. దానికి మళ్లీ చికిత్స తీసుకోవాల్సి వచ్చిందట. వైద్యుల సలహా తీసుకొని.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా జాగ్రత్తలుు తీసుకుంటూ.. ఆమె మళ్లీ తన వర్కౌట్స్, డైట్ కంటిన్యూ చేసింది. ఫలితంగా 62 కేజీల బరువు తగ్గింది. ప్రస్తుతం ఆమె బరువు 53 కేజీలు కావడం విశేషం. ఆమె ట్రాన్సఫర్మేషన్ చూసి అందరూ షాకౌతున్నారు. ఇంత బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదని అందరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 

click me!