కూచిపూడి డ్యాన్స్ తో అదరగొట్టిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కుమార్తె..!

Published : Nov 26, 2022, 10:09 AM IST
కూచిపూడి డ్యాన్స్ తో అదరగొట్టిన  బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కుమార్తె..!

సారాంశం

తొమ్మిదేళ్ల  అనౌష్క 'రాంగ్'- ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022లో భాగంగా ఈ ప్రదర్శన ఇవ్వడం విశేషం.  


బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కుమార్తె అనౌష్క కూచిపూడి డ్యాన్స్ అదరగొట్టింది.  శుక్రవారం లండన్‌లో పలువురు చిన్నారులతో కలిసి కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. తొమ్మిదేళ్ల  అనౌష్క 'రాంగ్'- ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022లో భాగంగా ఈ ప్రదర్శన ఇవ్వడం విశేషం.

4-85 సంవత్సరాల మధ్య వయస్సు గల 100 మంది కళాకారులు, ప్రత్యక్ష సంగీతకారులు, వృద్ధ సమకాలీన నృత్య కళాకారులు (65+ సంవత్సరాల ప్రదర్శన బృందం), అభ్యాస వైకల్యాలు ఉన్న వీల్‌చైర్ డ్యాన్సర్, పోలాండ్‌లోని నటరాంగ్ గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ బర్సరీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. .

ఈ డ్యాన్స్ ఈవెంట్‌కు రిషి సునక్ తల్లిదండ్రులతో పాటు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి కుమార్తె, అనౌష్క తల్లి అక్షతా మూర్తి హాజరయ్యారు.

రిషి సునక్ యునైటెడ్ కింగ్‌డమ్  57వ ప్రధానమంత్రి గా ఇటీవల ఎన్నికయ్యారు.  ఆ పదవిని చేపట్టిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం. 42 సంవత్సరాల వయస్సులో, Mr సునక్ 200 సంవత్సరాలలో అతి పిన్న వయస్కుడైన బ్రిటిష్ ప్రధాన మంత్రి గా రికార్డు సాధించారు. 

PREV
click me!

Recommended Stories

అమెరికా సైనికులు ఎందుకు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నిస్తున్నారు.? అస‌లేం జ‌రుగుతోంది.?
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?