పుతిన్ కు తీవ్ర అస్వస్థత.. !?

By Rajesh KarampooriFirst Published Nov 25, 2022, 4:29 PM IST
Highlights

రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని మరోసారి వార్తలు వెలుడుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ  సమావేశంలో పుతిన్ అకస్మాత్తుగా అసౌకర్యానికి గురయ్యారని మీడియా నివేదికలు తెలిపాయి. ఈ సమయంలో రష్యా అధ్యక్షుడి చేతి రంగు గులాబీ రంగులోకి మారిందని పేర్కొన్నాయి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో మరోసారి పలు కథనాలు వెలువడుతున్నాయి.  పుతిన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల క్యూబా దేశాధినేత మిగుయెల్ దియాజ్-కానెల్ వై బెర్మెడెజ్‌తో జరిగిన సమావేశంలో పుతిన్ చాలా బలహీనంగా కనిపించారనీ, చాలా అసౌకర్యంగా కుర్చోని ఉన్నడనీ, అతని చేయి గులాబీ రంగులో కనిపించాయని మీడియా నివేదికలు తెలిపాయి.

ది మిర్రర్ కథనం ప్రకారం.. సమావేశంలో పుతిన్ ముఖం పాలిపోయినట్లు , అతని శరీరం ఉబ్బినట్లు కనిపించింది. క్యూబా నాయకుడితో చర్చలో  పుతిన్ పూర్తిగా అసౌకర్యంగా కనిపించాడు. సమావేశంలో పుతిన్ పాదాలు కంటిన్యూగా వణుకుతున్నాయి. ఈ పరిస్తితులను గమనిస్తే.. అతడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుసుందని పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో.. రష్యా అధ్యక్షుడు కొంత తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.

ఉక్రెయిన్ యుద్ధంలో ఆయన పలు ఆరోగ్య  సమస్యలతో బాధపడుతున్నారు. క్రమంగా అతని ఆరోగ్యం దిగజారిందని,  యుద్ధ ఒత్తిడి కారణంగా అతని ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోందని ,దీంతో పుతిన్ వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నట్లు  పలు మీడియా సంస్థలు కథనాలను వెల్లడించాయి. పుతిన్‌కు ప్రాణాంతక వ్యాధి ఉందని, దాని కారణంగా అతని జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితమవుతుందని కూడా  వెల్లడించాయి. ఆయన గత కొన్ని నెలలుగా మద్యనిషేధం పాటిస్తున్నారు. పుతిన్ కడుపునొప్పి, భయము, దగ్గు మరియు పార్కిన్సన్స్ లక్షణాలు  టెలిగ్రామ్ చానల్‌ పేర్కొంది.

click me!