
న్యూఢిల్లీ: భారత సంతతి బ్రిటన్ ఎంపీ రిషి సునాక్ బ్రిటీష్ ప్రధాన మంత్రిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రిషి సునాక్ పై బలమైన పోటీకి దిగే ప్రయత్నం చేసిన మాజీ పీఎం బోరిస్ జాన్సన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోండంతో రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు మెరుగయ్యాయి. 2015లో ఎంపీగా గెలిచారు. యార్క్‌షైర్ రిచ్‌మాండ్ నుంచి గెలిచిన ఆయన పార్టీలో స్వల్పకాలంలోనే ఉన్నత స్థానాలకు ఎదిగారు. బ్రెగ్జిట్ కోసం క్యాంపెయిన్ చేసిన వారిలో కీలకంగా ఉన్నారు. లీవ్ ఈయూ క్యాంపెయిన్‌లో బోరిస్ జాన్సన్‌కు మద్దతుగా ఉన్నారు.
ప్రస్తుతం రిషి సునాక్‌కు వందకు పైగా ఎంపీల మద్దతు ఉన్నట్టు తెలుస్తున్నది. పీఎంగా బాధ్యతలు తీసుకోవడానికి కనీసం 100 మంది ఎంపీల మద్దతు ఆవశ్యకం. కొందరు కీలక క్యాబినెట్ మినిస్టర్లు కూడా రిషి సునాక్‌కు మద్దతు ఇస్తున్నారు. హోం మంత్రి గ్రాంట్ షాప్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ మంత్రి కెమి బడేనోచ్, వర్క్, పెన్షన్ మంతర్ి క్లో స్మిత్, మాజీ హోం మంత్రి సువెల్లా బ్రేవర్మాన్‌లు సునాక్‌కు మద్దతుగా ఉన్నారు.
Also Read: Boris Johnson Resign: బోరిస్ జాన్సన్‌ను దెబ్బతీసిన.. సెక్స్ స్కాండల్ సహా 5 కుంభకోణాలు ఇవే
యూకే ప్రధాని పోటీ గురించి ఐదు కీలక అంశాలు చూద్దాం.
1. కన్జర్వేటివ్ పార్టీ లీడర్‌గా ఎన్నికైనవారు యూకే ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటారు. ఈ పోటీలో నిలబడాలని అనుకునేవారు ఈ రోజు సాయంత్రం 6.30 గంటల్లోపు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. వంద మంది లామేకర్లు మద్దతు తెలిపిన వ్యక్తి పార్టీ లీడర్‌గా ఎన్నికవుతారు. ఆయనే పీఎంగా బాధ్యతలు తీసుకుంటారు. రిషి సునాక్‌తో పోటీలో ఎవరూ లేకుండా.. ఆయనకు 100 మంది ఎంపీలు మద్దతు ఇస్తే.. ఇదే రోజు విన్నర్‌గా రిషి సునాక్ నిలువనున్నారు. అలాగైతే.. యూకే పీఎం ఆయనే అనే విషయం కనీసమైనా ఈ రోజే తెలిసిపోనుంది. రిషి సునాక్‌కు 147 మంది ఎంపీల మద్దతు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయనే క్లియర్ ఫేవరైట్ క్యాండిడేట్‌గా ఉన్నారు.
2. ఈ పోటీలో నుంచి మాజీ పీఎం బోరిస్ జాన్సన్ తప్పుకున్నారు. తనకు మద్దతునిచ్చే ఎంపీల సంఖ్య ఉన్నప్పటికీ, మళ్లీ ప్రధానిగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ పని చేయడం సరైంది కాదని భావిస్తున్నట్టు వివరించారు. 2024 జనరల్ ఎన్నికల్లో గెలిచే స్కోప్ తనకు పుష్కలంగా ఉన్నదని తెలిపారు. ఈ పోటీలో గెలవడం కంటే కూడా గెలిచిన తర్వాత పార్లమెంటులో పార్టీ ఐక్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఎక్కవు అని వివరించారు. పార్టీ ఐక్యత కోసం తన పోటీని ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్‌లతో బోరిస్ జాన్సన్ కీలక భేటీలు నిర్వహించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. ఈ భేటీలో ఆయన ఎవరినీ తన వైపు తెచ్చుకోలేదు. ఒక వేళ తాను పోటీలో నుంచి తప్పుకున్నా బోరిస్ జాన్సన్‌కు కాకుండా రిషి సునాక్‌కే మద్దతు తెలుపుతానని పెన్ని మోర్డాంట్ సంకేతాలు ఇచ్చారు.
Also Read: యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం
3. రిషి సునాక్‌తో పోటీలో ఉన్న పెన్ని మోర్డాంట్ తాను డిసిప్లీన్‌డ్, ఆనెస్ట్ గవర్నమెంట్‌ను నడుపుతానని హామీ ఇచ్చారు. ఆమెకు బహిరంగంగా 25 మంది ఎంపీలు మద్దతు తెలిపారు.
4. బోరిస్ జాన్సన్ తన పోటీని ఉపసంహరించుకున్న నిర్ణయం వెలువడగానే రిషి సునాక్ బహిరంగంగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. బ్రెగ్జిట్, వ్యాక్సిన్ పంపిణీ వంటి కీలక అంశాల్లో ఆయన దేశాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారని పొగిడారు. ఆ విషయాల్లో ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉండాలని వివరించారు.
5. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పడేస్తానని చెబుతూ ఆదివారం రిషి సునాక్ పోటీలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు.