నిజమైన అయోధ్య నేపాల్‌లో, రాముడు ఇండియన్ కాదు: నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published 13, Jul 2020, 10:28 PM
Highlights

నిజమైన అయోధ్య నేపాల్‌లో ఉంది, శ్రీరాముడు నేపాలీవాడు, అతను ఇండియన్ కాదని నేపాల్ ప్రధాని  కేపీ శర్మ ఓలీ చెప్పారు.
 

ఖాట్మాండ్:నిజమైన అయోధ్య నేపాల్‌లో ఉంది, శ్రీరాముడు నేపాలీవాడు, అతను ఇండియన్ కాదని నేపాల్ ప్రధాని  కేపీ శర్మ ఓలీ చెప్పారు.

భారత్ కు చెందిన కాలాపానీ తమ ప్రాంతానికి చెందినవని చెప్పుకొన్న తర్వాత అయోధ్య రాముడు కూడ తమ వాడిగానే నేపాల్ ప్రధాని ఓలి ప్రకటించారు.

సోమవారం నాడు కేపీ శర్మ ఓలీ ఈ విషయాన్నిచెప్పారని నేపాలీ మీడియా ప్రకటించింది. తాము సాంస్కృతికంగా అణచివేయబడ్దాం, వాస్తవాలు ఆక్రమించబడ్డాయి. భారతీయ యువరాజు రాముడికి సీతను ఇచ్చామని తాము ఇప్పటికీ నమ్ముతున్నట్టుగా ఆయన తెలిపారు.

అయోధ్య బిర్గుంజుకు పశ్చిమాన థోరి వద్ద ఉంది. బల్మికి ఆశ్రమం నేపాల్ లో ఉంది. కొడుకును పొందడానికి దశరథ రాజు కరమ్మలు చేసిన పవిత్ర స్థలం రిడిలో ఉందని ఆయన చెప్పారు. 

దూరదర్శన్ మినహా అన్ని భారతీయ ప్రైవేట్ న్యూస్ ఛానెళ్లను నేపాల్ లో నిలిపివేసింది. దేశ జాతీయ మనోభావాలను దెబ్బతీసే నివేదికలను ప్రసారం చేస్తున్నట్టుగా ఆరోపించింది.నేపాల్ ప్రభుత్వం, ప్రధాని తీసుకొన్న నిర్ణయాలను విమర్శించినందుకు భారతీయ ఛానెల్స్ పై నిషేధించింది నేపాల్ సర్కార్.
 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 13, Jul 2020, 10:28 PM