కారణమిదీ: స్వీయ నిర్భంధంలోకి రష్యా అధ్యక్షుడు పుతిన్

By narsimha lodeFirst Published Sep 14, 2021, 4:59 PM IST
Highlights

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. పుతిన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా సోకింది. దీంతో పుతిన్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. పుతిన్  ఆరోగ్యంగా ఉన్నాడని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి తెలిపారు.

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు.పుతిన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా సోకడంతో పుతిన్ ఐసోలేషన్ కి వెళ్లాడు. ఈ మేరకు క్రెమ్లిన్ ఓ ప్రకటనను మంగళవారం విడుదల చేసింది.తజకిస్తాన్ లో వచ్చే వారంలో జరిగే ప్రాంతీయ భద్రతా మండలి సమావేశానికి పుతిన్ హాజరుకావడంపై సందిగ్థత నెలకొంది. తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమమలి రాఖ్ మాన్ తో ఆయన ఫోన్ లో మాట్లాడినట్టు ఆ ప్రకటన తెలిపింది.క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. పుతిన్ ఆరోగ్యంగానే ఉన్నాడని మీడియాకు చెప్పారు. పుతిన్ ఎంతకాలం స్వీయ నిర్భంధంలో ఉంటాడనే విషయమై స్పష్టత ఇవ్వలేదు.

స్పుత్నిక్ వ్యాక్సిన్ రెండో డోస్ ను పుతిన్ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలోనే తీసుకొన్నారు. సోమవారం నాడు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.పారా ఒలంపియన్స్ తో జరిగిన సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. బెలారస్ అధ్యక్షుడితో కలిసి సైనిక విన్యాసాలను ఆయన తిలకించారు.కరోనా పరీక్షల్లో పుతిన్ కు నెగిటివ్ వచ్చినట్టుగా పెస్కోవ్ చెప్పారు. 

click me!