జపాన్ లో భూకంపం.. సునామీ ముప్పు లేదు...

By AN TeluguFirst Published Sep 14, 2021, 9:14 AM IST
Highlights

భూకంప కేంద్రం 32.2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 138.2 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య 450 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. 

టోక్యో : జపాన్ లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. జపాన్ లోని ఇబరాకిలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7.46 గంటలకు భూకంపం సంభవించింది. 

భూకంప కేంద్రం 32.2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 138.2 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య 450 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. భూమి కంపించడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని, సునామీ ముప్పు కూడా లేదని జపాన్ అధికారులు చెప్పారు. 

కాగా, గత మంగళవారం మెక్సికోలోని పసిఫిక్ రిసార్ట్ నగరమైన అకపుల్కో సమీపంలో  7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తీవ్రతతో  రాజధానిలో ఒక్కసారిగా ఇల్లు కంపించాయి. ఒకరు మృతి చెందారు. 

భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కోకు ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు ఉందని నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ నివేదించింది. దీనికి సమీపంలోని కొయుకా డి బెనిటెజ్ సిటీలో యుటిలిటీ పోల్ మీద పడడంతో ఒక వ్యక్తి మరణించాడని, గెరెరో రాష్ట్ర గవర్నర్ హెక్టర్ అస్తుడిల్లో మిలెనియో చెప్పారు.

కానీ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ మాత్రం ఒక వీడియో సందేశంలో పెద్ద నష్టం జరిగినట్టు నివేదికలు లేవని చెప్పారు. అకాపుల్కోలో అనేక వాహనాలపై యుటిలిటీ స్తంభాలు పడిపోయాయి. చర్చి ముఖభాగం కూలిపోయిందని ఏఎఫ్ పి ప్రతినిధి తెలిపారు.

ఈ వరుస ప్రకంపనలతో బెంబేలెత్తిన పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేసి పరుగులు పెట్టారు.  "నేను స్నానం చేస్తున్నాను. ఒక్కటేసారి కంపించడం, కదులుతున్నట్లుగా అనిపించింది. నాకు చాలా భయం వేసింది. గట్టిగా అరిచాను" అని మెక్సికోకు చెందిన ఒక పర్యాటకుడు తెలిపాడు. ఈయన బాత్ టవల్‌తోనే బయటికి పరిగెత్తుకొచ్చాడు. 

మరొకరు మాట్లాడుతూ.. "నేను మా అమ్మతో వచ్చాను. మేము హోటల్ 11 వ అంతస్తులో ఉన్నాం" అని అతను ఏడుస్తున్న తన 86 ఏళ్ల తల్లిని కౌగిలించుకున్నాడు.

అకాపుల్కో మేయర్ అదెలా రోమన్ మాట్లాడుతూ, ఈ ప్రకంపనలు సిటీలో చాలా భయాందోళనలక దారి తీశాయన్నారు. "ప్రకంపనలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు ఆందోళన చెందుతున్నారు." అంతేకాదు దీని పర్యవసానంగా నివాస ప్రాంతాలలో "చాలా గ్యాస్ లీకేజీలు" గుర్తించబడ్డాయని ఆమె చెప్పారు.

భూకంపం మెక్సికో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్రంగా వచ్చింది. నివాసితులు మరియు పర్యాటకులు ఇళ్లు, హోటళ్ల నుండి వీధుల్లోకి పరుగులు పెడుతున్నారు. 

ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదు..

"నేను చాలా భయపడ్డాను. ఈ రాత్రి నేను నిద్రపోతానో లేదో నాకు తెలియదు. నా కుమార్తె గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఆమెను బయటకు తీసుకెళ్లడానికి నేను ఆమెను లేపాను. నేను బూట్లు కూడా వేసుకోలేదు.  నేను బూట్లు కూడా వేసుకోలేదు" అని 49- అన్నారు ఏళ్ల నివాసి లారా విల్లా.

రాజధానిలో తీవ్రమైన నష్టం గురించి తక్షణ నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ ట్విట్టర్‌లో తెలిపారు. అనేక ప్రాంతాల్లో కరెంట్ లేకుండా పోయింది. దీన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి విద్యుత్ బోర్డు కృషి చేస్తోందని ఆమె తెలిపారు.

భూకంపం పవర్ గ్రిడ్‌ను తాకినప్పుడు రాజధాని పైన ఆకాశంలో కాంతి వెలుగులు కనిపించాయి. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులోని మెక్సికో ప్రపంచంలోని భూకంప అత్యంత చురుకైన ప్రదేశాలలో ఒకటి. 

అంతకుముందు సెప్టెంబర్ 19, 1985 న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 10,000 మందికి పైగా మరణించారు. వందలాది భవనాలు ధ్వంసం అయ్యాయి. 2017 లో  7.1 తీవ్రతతో వచ్చిన భూకంపంలో దాదాపు 370 మంది మరణించారు. 

click me!