యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో క్లారిటీ ఇచ్చిన పుతిన్

By Rajesh KarampooriFirst Published Dec 24, 2022, 6:59 AM IST
Highlights

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని అతి త్వరలో ముగిస్తామని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. యుద్ధాన్ని వేగంగా ముగించేందుకు కష్టపడుతున్నామన్నారు. ఉక్రెయిన్ రష్యా వార్ ముగింపు దశకు వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య  హోరాహోరీగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా సైన్యం  మిసైళ్లతో విరుచుకుపడుతుంది. బాంబుల మోతతో ఆ దేశంలోని ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి.పలుసార్లు రష్యా సైన్యం తమ దాడులను ఆపినప్పటికీ మళ్లీ కొనసాగిస్తూనే ఉంది. అదే సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలు ఉక్రెయిన్‌కు మానవతా , సైనిక సహాయాన్ని అందిస్తున్నాయి.

సైనిక సహాయంలో భాగంగా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ వ్యవస్థను అమెరికా సమకూర్చింది. ఇదిలా ఉంటే.. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు కష్టపడుతున్నామని, ఉక్రెయిన్ రష్యా యుద్దం ముగింపు దశకు వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
తాజాగా.. మాస్కోలో మీడియాతో పుతిన్ ముచ్చటించారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని అతి త్వరలో ముగిస్తామని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. యుద్ధాన్ని వేగంగా ముగించేందుకు కష్టపడుతున్నామన్నారు. ఉక్రెయిన్ రష్యా వార్ ముగింపు దశకు వచ్చిందని అనుకుంటున్నట్లు చెప్పారు. సాయుధ పోరాటాలన్నీ చర్చల ద్వారా ముగుస్తాయని రష్యా అధ్యక్షుడు అన్నారు.

శాంతికి బదులుగా ఉక్రెయిన్ చివరికి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఈ విషయాన్ని కైవ్(ఉక్రెయిన్) ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిదని పుతిన్ హితవు పలికారు. జెలెన్‌స్కీ పర్యటనపై  పుతిన్‌ మాట్లాడుతూ.. రక్షణ కోసమే ఇతర దేశాల సాయం తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. దీని వల్ల సంక్షోభం మరింత కాలం పాటు కొనసాగిస్తుందని హెచ్చరించారు. 

అదే సమయంలో ఉక్రెయిన్ కు అమెరికా మద్దతుగా నిలువడం, పేట్రియాట్ వైమానిక రక్షణను సమాకుర్చడంపై స్పందించారు. అమెరికా పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థకు కాలం చెల్లినదని పుతిన్ అన్నారు. రష్యా పేట్రియాట్ వ్యవస్థను సులభంగా తిప్పికొడుతుందని అన్నారు.పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ చాలా పాతదని ఆయన అన్నారు. రష్యా పేట్రియాట్ వ్యవస్థను తొలగిస్తుంది. 

ఉక్రెయిన్‌కు అమెరికా సహాయం 

ఉక్రెయిన్ కు అమెరికా మద్దతుగా నిలిచింది. యుద్ద సమయంలో ఉక్రెయిన్‌కు అమెరికా 1.8 బిలియన్‌ డాలర్ల విలువైన సైనిక ఉత్పత్తులను అందించాలని నిర్ణయించింది. అంతేకాకుండా క్షిపణి దాడులను తట్టుకునేలా  పేట్రియాట్‌ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను  అందిస్తామని హామీ ఇచ్చింది. అన్ని విధాలా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని అమెరికా భరోసా నిచ్చింది. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకు...అమెరికాలో ఘన స్వాగతం లభించింది. 

click me!