చైనాలో బీభత్సానికి ముందు 91 దేశాల్లో బీఎఫ్.7 వేరియంట్ కేసులు!

Published : Dec 23, 2022, 03:03 PM IST
చైనాలో బీభత్సానికి ముందు 91 దేశాల్లో బీఎఫ్.7 వేరియంట్ కేసులు!

సారాంశం

చైనాలో కరోనా వైరస్ కేసులు అమాంతం పెరిగిపోవడంతో ప్రపంచమంతా మరోసారి భయాందోళనలకు గురవుతున్నాయి. కానీ, చైనాలో ఈ ప్రళయానికి కారణమైన బీఎఫ్.7 వేరియంట్ ఇప్పటికే గత 22 నెలల్లో 91 దేశాల్లో కనిపించింది. కానీ, దాని ప్రభావం చాలా స్వల్పంగా ఉన్నదని తెలుస్తున్నది. కానీ, చైనాలో ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ మరింత పరిణామం చెంది ఇంకా ప్రమాదకరంగా మారితే ఎలా అనే అంశంపై కొందరు నిపుణులు తమ ఆందోళనలను వెలిబుచ్చారు.  

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా భయాలు ముందుకు వచ్చాయి. చైనాలో బీభత్సంగా పెరుగుతున్న కరోనా కేసులు ఈ భయానికి ప్రధానంగా ఉన్న కారణం. బీఎఫ్.7 వేరియంట్ తాండవించడంతో చైనాలో కరోనా కేసులు మూకుమ్మడిగా పెరిగిపోయాయి. ఇందువల్లే బీఎఫ్.7 వేరియంట్ పై చర్చ తీవ్రమైంది. నిజంగా బీఎఫ్.7 వేరియంట్‌ అంత ప్రమాదకరమైందా?

చైనాలో ఇప్పుడు బీభత్సం సృష్టిస్తున్న బీఎఫ్.7 ఒమిక్రాన్ వేరియంట్ అంతకు ముందే 91 దేశాల్లో కనిపించింది. గత 22 నెలలుగా ఈ వేరియంట్ పలు దేశాల్లో కనిపించింది. కానీ, అరుదుగా కనిపించింది. ఎక్కువ నష్టం కూడా చేయలేదు. స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన డేటా ప్రకారం, 2021 ఫిబ్రవరి నుంచి 91 దేశాల్లో రిపోర్ట్ అయిన వేరియంట్ జెనెటిక్, మ్యుటేషన్ ప్రొఫైల్ బీఎఫ్.7తో మ్యాచ్ అయ్యాయి. వీటిని 2022 మేలో ఒమిక్రాన్ సబ్ లీనియేజ్‌లో కలిపినట్టు ఇన్సాకాగ్ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. బీఎఫ్.7 కూడా ఒమిక్రాన్ వేరియంట్‌‌లో నుంచి పరిణమించిన బీఏ.5‌కు చెందినదని తెలిసిందే.

ఇప్పటికే అన్ని దేశాల్లో ఈ వేరియంట్ కనిపించినప్పుడు కొత్తగా బీఎఫ్.7 వేరియంట్ అంటే ఎందుకంత భయం అనే సందేహం ముందుకు రాకమానదు. దీనిపై వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులు, అంటువ్యాధుల నిపుణులు టైమ్స్ ఆఫ్ ఇండియాకు వారి అభిప్రాయాలు తెలిపారు. కొత్తగా ఈ వేరియంట్ పై భయపడటం ఆశ్చర్యంగా ఉన్నదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ వ్యాప్తి చాలా స్వల్పం.. ఒక్కోసారి పట్టించుకోనవసరం లేనంత స్వల్పంగా ఉన్నదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంపిళ్లలో ఈ వేరియంట్ కేసులు 0.5 శాతం మాత్రమే అని వివరించారు. గతేడాది ఫిబ్రవరి 26 నుంచి (ఈ వేరియంట్ గుర్తించినప్పటి నుంచి) బీఎఫ్.7 వేరియంట్ కేసులు 47,881 అని ఓ ఇన్సాకాగ్ అధికారి తెలిపారు. 

Also Read: కోవిడ్-19 నాసల్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువ‌చ్చిన కేంద్రం: టాప్-10 పాయింట్స్

గత 22 నెలలుగా చాలా దేశాల్లో బీఎఫ్.7 వేరియంట్ ఉన్నప్పటికీ కేసుల పెరుగుదలకు ఇది కారణంగా లేదని, నిజానికి అదే సమయంలో వ్యాప్తిలో ఉన్న ఇతర ఒమిక్రాన్ సబ్ లీనియేజ్‌లు అంటే ఎక్స్‌బీబీ, బీక్యూ.1.1 వంటివి కేసులను పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా బీఎఫ్.7 ప్రివలెన్స్ రేట్ 0.5 శాతం అంటే.. ఇది ఎక్కువ విస్తరించే శక్తిని కలిగి లేదని అర్థం అవుతుందని ఇన్సాకాగ్ జీనోమ్ సీక్వెన్స్ ప్రోగ్రామ్‌లో పని చేసే ఓ వైరాలజిస్టు తెలిపారు.

మన దేశంలోనూ బీఏ.5 వేరియంట్ చాలా తక్కువగా ఉన్నది. కానీ, ఎక్స్‌బీబీ వేరియంట్ మాత్రం డామినెంట్‌గా ఉన్నదని, దేశంలోని 73 శాతం కేసులు ఆ వేరియంట్‌వే. కాబట్టి, మరి కొత్తగా బీఎఫ్.7 అంటే భయపడాల్సిన అవసరం ఏమిటీ? చైనాలో బీభత్సం దీనికి కారణంగా తోస్తున్నది.

కానీ, చైనాలో అమాంతంగా కేసులు ఎందుకు పెరిగాయనేదానికి పలు వాదనలు ఉన్నాయి. కరోనా వైరస్‌కు ఎక్స్‌పోజ్ కాని, లేదా ఈ వైరస్‌ను ఎదుర్కొని వ్యాధినిరోధక శక్తిని అభివృద్ధి చేసుకోని సమాజంలో బీఎఫ్.7 వేరియంట్ ప్రబలం అవుతున్నది. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, చైనా ప్రభుత్వం తయారు చేసిన తక్కువ సామర్థ్యం గల టీకాలు వేయడం, అవీ లో కవరేజీ కావడం, జీరో కోవిడ్ పాలసీని అకాస్మతుగా ఎత్తేయడం వంటి కొన్ని కీలక కారణాలు కేసుల ఆకస్మిక పెరుగుదలకు కారణంగా ఉండొచ్చని డాక్టర్ పుజారీ తెలిపారు.

కానీ, చైనా పరిణామంతో భయపడాల్సిన విషయం ఒకటి ఉన్నదని వారు చెబుతున్నారు. చైనాలో పరిస్థితులతో సార్స్ కొవ్ 1 మరింత పరిణామం చెందే ముప్పు ఉంటుందని, అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశమూ ఉంటుందని వివరించారు. కాబట్టి, వైరస్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి, అడ్డుకట్ట వేయడానికి ప్లాన్లు ప్రిపేర్ చేయాలని అభిప్రాయపడ్డారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే