చైనాలో కరోనా కల్లోలం.. ఒక్క రోజే 3.7 కోట్ల కేసులు.. 

By Rajesh KarampooriFirst Published Dec 24, 2022, 6:11 AM IST
Highlights

చైనాలో కరోనా కలకలం సృష్టించింది.ఒకే ఒక్క రోజులో 37 మిలియన్లు అంటే 3కోట్ల 70 లక్షల మంది కరోనా బారిన పడ్డారని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.ఈ నెల 20 వరకు చైనా మొత్తం జనాభాలో 18 శాతం మంది అంటే 248 మిలియన్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 

చైనా లో కరోనా కల్లోలం: చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. చైనా లో జీరో కోవిడ్ విధానాన్ని సడలించినప్పటి నుండి అక్కడ కరోనా కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్ల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కేవలం ఒక్కే ఒక్క రోజులో 3కోట్ల 70 లక్షల మంది ప్రజలు కోవిడ్ -19 బారిన పడ్డారు. ప్రపంచంలో ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

మీడియా నివేదికల ప్రకారం.. ఈ నెల 20 వరకు చైనా మొత్తం జనాభాలో 18 శాతం మంది అంటే 248 మిలియన్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. బుధవారం జరిగిన చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ సమావేశంలో ఈ గణాంకాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే, ఈ గణాంకాలు చైనీస్ ఏజెన్సీకి ఎక్కడ నుండి వచ్చాయి, ఇంకా స్పష్టంగా తెలియలేదు. ధృవీకరించబడితే.. చైనాలో COVID ఇన్‌ఫెక్షన్ రేటు జనవరి 2022లో 4 మిలియన్ల రోజువారీ కేసుల మునుపటి రికార్డును మించిపోతుంది.

జీరో కోవిడ్ విధానం సడలింపు 

చైనా దీర్ఘకాలంగా కొనసాగుతున్న జీరో కోవిడ్ విధానాన్ని సడలించినప్పటి నుండి.. అక్కడ కరోనా కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అత్యంత ప్రమాదకరమైన రీతిలో కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఏజెన్సీ అంచనాల ప్రకారం..చైనా లోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్ , రాజధాని బీజింగ్‌లోని జనాభాలో సగానికి పైగా కరోనా బారిన పడ్డారు.
 
డిసెంబర్ ప్రారంభంలో దేశంలో PCR పరీక్షా కేంద్రాల నెట్‌వర్క్ మూసివేయబడినందున, చైనా ఆరోగ్య సంస్థ కరోనా ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి ఈ అంచనాను ఎలా రూపొందించిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. COVID మహమ్మారి సమయంలో ఇతర దేశాలలో ఖచ్చితమైన ఇన్‌ఫెక్షన్ రేట్లు నిర్ధారించడం కూడా కష్టంగా ఉంది.  ఎందుకంటే ముందుగా ఉన్న పరీక్షా కేంద్రాలు COVID పరీక్షా ల్యాబ్‌లుగా మార్చబడ్డాయి , డేటాను సేకరించలేదు. అదే సమయంలో కరోనా కేసుల సంఖ్యను వెల్లడించడాన్ని కూడా ప్రభుత్వం నిలిపివేసింది.

జనవరి చివరి నాటికి చాలా నగరాల్లో కోవిడ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.  డేటా కన్సల్టెన్సీ మెట్రోడేటాటెక్‌లో చీఫ్ ఎకనామిస్ట్ చెన్ క్విన్ ప్రకారం చైనాలో ప్రస్తుత కోవిడ్ వేవ్ డిసెంబర్ మధ్య నుండి జనవరి చివరి వరకు చాలా నగరాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. అతని ప్రకారం.. షెన్‌జెన్, షాంఘై , చాంగ్‌కింగ్ నగరాల్లో గరిష్ట సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతాయని తెలిపారు. ప్రతిరోజూ మిలియన్ల సంఖ్యలో కేసులు నమోదవుతాయని అంచనా వేశారు.

click me!