పుతిన్ ఒక నియంత, అనైతిక యుద్ధం చేస్తున్న దుండ‌గుడు - అమెరికా అధ్య‌క్షుడు జో బిడెన్

Published : Mar 18, 2022, 10:59 AM IST
పుతిన్ ఒక నియంత, అనైతిక యుద్ధం చేస్తున్న దుండ‌గుడు - అమెరికా అధ్య‌క్షుడు జో బిడెన్

సారాంశం

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పుతిన్ ఒక హంతక నియంత అని, దుండగుడు అని విమర్శించారు. ఉక్రెయిన్ లో ఆయన చేస్తున్నది అమానవీయం అని తెలిపారు. 

ఉక్రెయిన్ (ukraine)లో రష్యా (russia) సైనికులు దాడి కొన‌సాగిస్తున్నారు. దీంతో ఉక్రెయిన్ తీవ్రంగా అల్లాడిపోతోంది. దీనికి ఉక్రెయిన్ బ‌ల‌గాలు ధీటుగా స‌మాధానం ఇస్తున్నా.. చిన్న దేశం ఎంతో న‌ష్ట‌పోతోంది. అయితే ఉక్రెయిన్ పై ర‌ష్యా చేస్తున్న యుద్ధంపై అమెరికా అధ్య‌క్షుడు జో బిడెన్ (america President Joe Biden) విరుచుకుప‌డ్డారు. రష్యా అధ్య‌క్ష‌డు పుతిన్ (russian president vladimir putin) ఒక హంత‌క నియంత అని, దుండ‌గుడు అని అభివ‌ర్ణించారు. 

కాపిటల్ హిల్‌లో సెయింట్ పాట్రిక్స్ డే (saint patricks day) సందర్భంగా జో బిడెన్ (Joe Biden) మాట్లాడారు. పుతిన్ హంతక నియంత అని అన్నారు. ఉక్రెయిన్ ప్రజలపై అనైతిక యుద్ధం చేస్తున్న స్వచ్ఛమైన దుండగుడు అని తీవ్రంగా ఆక్షేపించారు. అంతకుముందు ఐర్లాండ్‌కు చెందిన టావోసీచ్ మైఖేల్ మార్టిన్‌తో జరిగిన సమావేశంలో రష్యా నాయ‌కుడిపై మాట్లాడుతూ.. పుతిన్ చేస్తున్న‌ది క్రూరత్వం. ఉక్రెయిన్ లో ఆయ‌న ద‌ళాలు చేస్తున్న‌ది అమాన‌వీయం అని అన్నారు. 

పుతిన్‌ను యుద్ధ నేరస్థుడు అని పిలిచిన రోజే బిడెన్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా అధ్య‌క్షుడి చ‌ర్యల‌ను ఖండిస్తూ జో బిడెన్ ఇటీవ‌ల ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. బుధవారం కూడా వోలోడిమిర్ జెలెన్స్కీ (volodymyr zelensky) కాంగ్రెస్‌కు ఉద్వేగభరితమైన ప్రసంగం చేసిన కొన్ని గంటల తర్వాత బిడెన్ ఉక్రెయిన్‌కు కొత్త అమెరికన్ సైనిక సహాయాన్ని అందించాడు. ఇందులో ఆయుధాలు, డ్రోన్‌లు, అలాగే యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ ఆర్మర్ సిస్టమ్‌లు ఉన్నాయి. 

జో బిడెన్ వ్యాఖ్య‌ల‌కు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ( Dmitry Peskov) స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బిడెన్ వ్యాఖ్యలు పూర్తిగా ఆమోదయోగ్యం కానివి అని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు క్షమించరానివి అని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను యుద్ధ నేరస్థుడుగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాటలను మాస్కో అనుమానించదగినది, క్షమించరానిది గా పరిగణిస్తుంద‌ని డిమిత్రి పెస్కోవ్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వందల వేల మంది అమెరికా బాంబుల వల్ల మరణించారని పెస్కోవ్ చెప్పారు. ‘‘ మా అధ్యక్షుడు చాలా తెలివైన, దూరదృష్టి కలిగిన, సంస్కారవంతమైన అంతర్జాతీయ వ్యక్తి. ఆయ‌న రష్యన్ ఫెడరేషన్ అధిపతి ’’ అని అన్నారు. పుతిన్ అమెరికా నాయకుడికి ఎందుకు సమాధానం ఇవ్వ‌రు అనే ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ పెస్కోవ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం (International Court of Justice) నిర్ణయాన్ని మాస్కో పరిగణనలోకి తీసుకోద‌ని పెస్కోవ్ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ‘‘ మెడిన్స్కీ నేతృత్వంలోని మా ప్రతినిధి బృందం, నిపుణులు, సంబంధిత విభాగాల సభ్యులు 24 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ దురదృష్టవశాత్తు, ఉక్రేనియన్ వైపు మేము ఇదే విధమైన ఉత్సాహాన్ని చూడ‌టం లేదు’’ అని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే