
చిన్నప్పుడు ఎప్పుడో తాను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు తనను టీచర్ కించ పరిచారని ఓ వ్యక్తి... ఇటీవల తమ టీచర్ పై దాడి చేశాడు. దాదాపు 101 సార్లు పొడిచి చంపేశాడు. ఈ సంఘటన 2020లోనే చోటుచేసుకోగా.. తాజాగా.. నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.
ప్రైమరీ స్కూల్‌లో దాదాపు 30ఏళ్ల క్రితం తనను టీచర్ కించ పరిచిందని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. ఆమెను అతి దారుణంగా పొడి చంపేశాడు. తాను తన టీచర్ ని పొడిచి చంపానని నిందితుడు అంగీకరించినట్లు బెల్జియన్ ప్రాసిక్యూటర్లు గురువారం తెలిపారు.
గుంటెర్ ఉవెంట్స్ పరిశోధకులతో మాట్లాడుతూ, 1990ల ప్రారంభంలో, అతను ఏడేళ్ల వయస్సులో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుండి, ఉపాధ్యాయురాలు మారియా వెర్లిండెన్ తనను ప్రతిసారీ కించపరిచినట్లు అతను చెప్పడం గమనార్హం.
2020లో ఆంట్‌వెర్ప్ సమీపంలోని హెరెంటల్స్‌లోని 59ఏళ్ల వెర్లిండెన్ ఆమె తన ఇంటిలో ఉండగానే హత్య చేయడం గమనార్హం. ఆమె ఇంటికి వెళ్లి మరీ.. కత్తితో 101 సార్లు పొడిచింది. ఆమె భర్త ఎదురుగానే ఆమెను అతి దారుణంగా చంపేశాడు.
మీడియా కథనాల ప్రకారం ఆమె 101 సార్లు కత్తిపోట్లకు గురైంది. ఆమె మృతదేహం పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్‌పై చాలా ఎక్కువ మొత్తంలొ డబ్బు ఉందట. అయినా.. వాటిని ముట్టుుకోకుండా.. కేవలం ఆమెను చంపి వెళ్లడంతో... దోపిడి దొంగ కాదని.. కావాలనే హత్య చేశాడనే అనుమానం కలిగింది.
నవంబర్ 20, 2020 న హత్య జరిగిన పదహారు నెలల తర్వాత.. నిందితుడు తాను చేసిన హత్య గురించి తన స్నేహితుడితో చెప్పాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఇటీవల నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. కాగా.. నిందుతుడు కూడా నిజాన్ని అంగీకరించడంతో అతనికి త్వరలోనే శిక్ష విధించే అవకాశం ఉంది.