చమురు ధరల పెంపుతో తీవ్ర ఆందోళనలు.. పదుల సంఖ్యలో నిరసనకారులు.. 12 మంది పోలీసులు మృతి

Published : Jan 06, 2022, 08:15 PM ISTUpdated : Jan 06, 2022, 08:19 PM IST
చమురు ధరల పెంపుతో తీవ్ర ఆందోళనలు.. పదుల సంఖ్యలో నిరసనకారులు.. 12 మంది పోలీసులు మృతి

సారాంశం

కజకిస్తాన్ ఆందోళనలతో మండిపోతున్నది. చమురు ధరలను దాదాపు రెట్టింపు స్థాయికి పెంచడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికాయి. తొలుత అతిపెద్ద నగరం అల్మాటీలో ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత దేశమంతటా పాకాయి. ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి ప్రభుత్వ భవనానలు ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఓ మేయర్ బిల్డింగ్‌కు నిప్పు పెట్టారు కూడా. ఈ ఆందోళనల్లో 12 మంది పోలీసులు మరణించారు. 353 మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు.  

న్యూఢిల్లీ:  కజకిస్తాన్‌(Kazakhstan)లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చమురు ధరలు(Fuel Price) దాదాపు రెట్టింపు స్థాయికి పెరగడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికాయి. తొలుత అల్మాటి నగరంలో ఈ ఆందోళనలు జరిగినా.. ఆ తర్వాత వేగంగా దేశమంతటా పాకాయి. ఈ ఆందోళనల్లో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు. 12 మంది పోలీసులు మరణించారు. ఇందులో ఒకరిని తల నరికి చంపేశారు. చమురు ధరల పెంపుతో ఆందోళనకారులు ఆగ్రహంతో ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేశారు. సుమారు 353 మంది నిరసనకారులు గాయపడ్డారు.

అల్మాటి నగరంలో బుధవారం రాత్రికి రాత్రే కొన్ని ప్రభుత్వ భవనాలను కూల్చేయాలని నిరసనకారులు ప్రయత్నించారని పోలీసుల ప్రతినిధి సల్తనాట్ అజిర్బెక్ వివరించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. బుధవారం నగరంలో భారీగా ఆందోళనలు పెల్లుబికిన తర్వాత భవనాలు కూల్చేయాలని కొందరు భావించారని పేర్కొన్నారు. అంతకు ముందే మేయర్ బిల్డింగ్‌ను ఆందోళనకారులు ఘెరావ్ చేశారు. దానికి నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. కజకిస్తాన్‌కు స్వాతంత్ర్యం లభించి మూడు దశాబ్దాలు గడుస్తున్నాయి. అప్పటి నుంచి ఈ స్థాయిలో ఆందోళనలు ఎప్పుడూ జరగలేవు. దేశంలో ఆందోళనలను అదుపులోకి తేవడానికి రష్యా సారథ్యంలోని మిలిటరీ అలయెన్స్ అదనపు ట్రూపులను పంపడానికి సిద్ధమైంది. అదనపు బలగాల కోసం కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిమ్ జొమార్ట్ తొకయెవ్ విజ్ఞప్తి చేశారు.

కజకిస్తాన్‌లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) ధరలను గత ఆదివారం దాదాపు రెట్టింపునకు పెంచారు. ఈ దేశంలో ఎల్పీజీని వంట చెరుకుగానే కాదు.. వాహన ఇంధనాల  గానూ ఎక్కువగా వినియోగిస్తారు. ఈ చమురు ధర పెరగడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వచ్చాయి. ఈ ఆందోళనలను అదుపులోకి తేవడానికి కఠిన చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు బుధవారం వెల్లడించారు. రెండు వారాలు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ముందుగా దేశ రాజధాని నూర్ సుల్తాన్, అతిపెద్ద నగరం అల్మాటిలో ఎమర్జెన్సీ విధించారు. ఆ తర్వాత దీన్ని దేశమంతటికీ విస్తరించారు.

ఈ ఆందోళనలను కొందరు తీవ్రవాదులే ప్రేరేపించారని అధ్యక్షుడు ఆరోపించారు. విదేశాల నుంచి కొంత సహాయం వారికి అందించిందని పేర్కొన్నారు. అయితే, ఈ ఆందోళనలకు ప్రత్యేకంగా ఒక నాయకుడు ఉన్నట్టు లేడు. అలాగే, స్పష్టమైన  డిమాండ్లు బయటకు రాలేవు. కానీ, చాలా మంది నిరసనకారులు ఓల్డ్ మ్యాన్ గో అని నినదిస్తున్నారు. బహుశా ఇది ఆ దేశ తొలి అధ్యక్షుడు నజర్బయెవ్‌ను ఉద్దేశించి పేర్కొంటున్నట్టు తెలుస్తున్నది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఆయన అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత రాజీనామా చేసినప్పటికీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ప్రభావం ఎక్కుగా ఉన్నది. ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒకే పార్టీ అధికారంలో ఉన్నది.

ఆఫ్ఘనిస్తాన్‌కు అత్యంత సమీపంలో వుండే కజికిస్తాన్‌లో ఆగస్టు 27వ తేదీ భారీ పేలుడు సంభవించింది. మిలటరీ ప్రాంతంలో జరిగిన ఈ విస్ఫోటనంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 80 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. తారాజ్ సిటీలో ఈ  పేలుడు చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. పేలుళ్ల తీవ్రత నేపథ్యంలో సమీపంలోని గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పేలుళ్ల తీవ్రత కారణంగా అటుగా వెళ్లే రోడ్లు, రైల్వే మార్గాలను మూసివేశారు అధికారులు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !