జీ జిన్‌పింగ్.. డౌన్.. డౌన్! చైనీస్ కమ్యూనిస్టు పార్టీ.. డౌన్.. డౌన్! చైనాలో పెల్లుబికిన పౌరుల ఆందోళనలు

By Mahesh KFirst Published Nov 27, 2022, 1:10 PM IST
Highlights

చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ ప్రజలు చైనీస్ కమ్యూనిస్టు పార్టీకి, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

న్యూఢిల్లీ: సాధారణంగా చైనాలో బహిరంగ ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు కనిపించడం అరుదుల్లోకెల్లా అరుదు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న ఆదేశాలు తూచా తప్పకుండా అక్కడ అమలు జరుగుతుంటాయి. ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కడా బహిరంగంగా కనిపించేది కాదు. కానీ, తాజాగా, ఇందుకు పూర్తిగా విరుద్ధమైన ఘటన జరిగింది. చైనాలో షాంఘై నగరంలో కరోనా లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ రోడ్డుపైకి వచ్చి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి జీ జిన్‌పింగ్ డౌన్.. డౌన్ అని, చైనీస్ కమ్యూనిస్టు పార్టీ.. డౌన్.. డౌన్ అని నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

చైనాలో లాక్‌డౌన్ కొత్తేమీ కాదు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ ప్రపంచంలోనే అత్యంత కఠిన లాక్‌డౌన్ ఆ దేశంలో అమలు చేస్తున్నారు. తాజా ఆందోళనలకు తక్షణ కారణంగా ఓ అగ్ని ప్రమాదం ఉన్నది. షీజియాంగ్ రీజియన్ రాజధాని ఉరుంఖిలో ఓ భారీ భవంతిలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఆ బిల్డింగ్‌నూ పాక్షికంగా లాక్‌డౌన్ చేయడంతో కొందరు నివాసులు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వాదనలను అధికారులు తిప్పికొట్టారు.

Also Read: చైనాలోని జిన్జియాంగ్ లో అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. 9 మందికి గాయాలు

షాంఘైలో వులుముఖి రోడ్డు పై శనివారం రాత్రి పెద్ద మొత్తంలో ప్రజలు గుమిగూడారు. వారంతా లాక్ డౌన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఉరుంఖిలో లాక్‌డౌన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. షిజియాంగ్‌లో లాక్‌డౌన్ ఎత్తేయాలని, చైనా మొత్తం లాక్‌డౌన్ ఎత్తేయాలని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

上海乌鲁木齐路 民众高喊
共产党 下台!
这是迄今为止最为激进的口号。 pic.twitter.com/ijP7lxnIgH

— 李老师不是你老师 (@whyyoutouzhele)

కాగా, మరో పాయింట్‌లో ప్రజలు గుమిగూడి ఆందోళనలు చేశారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ డౌన్ డౌనన్.. జీ జిన్‌పింగ్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. ఉరుంఖిని విముక్తి చేయండని డిమాండ్ చేశారు. వారిని పెద్ద మొత్తంలో పోలీసులు పర్యవేక్షించారు. కొన్నిసార్లు ఆ గుంపునూ చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

click me!