స్వేచ్చగా జీవించాలంటే.. మరణ భయాన్ని వీడాలి.. తనపై దాడి వెనుక ప్రముఖుల హస్తం: ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు

Published : Nov 27, 2022, 12:30 PM IST
స్వేచ్చగా జీవించాలంటే.. మరణ భయాన్ని వీడాలి.. తనపై దాడి వెనుక ప్రముఖుల హస్తం: ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు

సారాంశం

తుపాకీ దాడిలో గాయపడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి రావల్పిండిలో జరిగిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ పార్టీ నిరసన ప్రదర్శనను విరమిస్తున్నట్లు  ప్రకటించారు. తమ పార్టీ అన్ని అసెంబ్లీల నుండి నిష్క్రమించనున్నట్లు ప్రకటించారు. తనపై జరిగిన ఘోరమైన దాడి వెనుక పీఎం షాబాజ్ షరీఫ్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ హస్తం ఉందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.    

ఇమ్రాన్ ఖాన్ దాడి: ఈ నెల ప్రారంభంలో తనను హత్య చేసేందుకు విఫలయత్నం చేసిన ముగ్గురు నేరస్థులు మళ్లీ తనను టార్గెట్ చేసేందుకు వెతుకుతున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం రావల్పిండిలో తన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నిర్వహించిన ర్యాలీని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..తన మరణం చాలా దగ్గరగా ఉందని, దాడి సమయంలో.. బుల్లెట్లు తన తలపై నుండి వెళ్లాయని చెప్పాడు. దాడి తర్వాత పార్టీ నిర్వహించిన మొదటి ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన ముగ్గురు నేరస్థులు మళ్లీ దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత అవినీతి రాజకీయ వ్యవస్థలో తమ పార్టీ ఒక భాగంగా ఉండకూడదని, బదులుగా అన్ని అసెంబ్లీలకు రాజీనామా చేస్తానని ఖాన్ పేర్కొన్నాడు. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ముందస్తు ఎన్నికలను ప్రకటించాలని బలవంతం చేసేందుకు ఇస్లామాబాద్‌పై కవాతుకు బదులు ప్రావిన్షియల్ అసెంబ్లీలకు రాజీనామా చేయాలని తమ పార్టీ నిర్ణయించిందని ఖాన్ చెప్పారు. ఇప్పటికే ఫెడరల్ పార్టీ పార్లమెంట్‌కు రాజీనామా చేసిందనీ,  అయితే రెండు ప్రావిన్సులు, రెండు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లలో అధికారంలో ఉంది.

దాడి వెనుక ఎవరున్నారు?

తనపై జరిగిన దాడి వెనుకల ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, అంతర్గత మంత్రి రాణా సనావుల్లా, ఐఎస్ఐ 'కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్' హెడ్ మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ ల హస్తముందని  పదేపదే ఆరోపించారు.స్వేచ్ఛగా జీవించాలనుకుంటే మరణం గురించి భయపడవద్దని తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.భయం మనల్ని బానిసలుగా మార్చుతుందని అన్నారు. కర్బలా యుద్ధం గురించి ప్రస్తావిస్తూ..ముహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్, అతని కుటుంబ సభ్యులు కర్బలాలో చంపబడ్డారు.ఎందుకంటే వారు తమ కాలపు నిరంకుశ పాలకుడికి వ్యతిరేకంగా పోరాడారు. మనం కూడా వారిలా పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  

ఇమ్రాన్‌ ఖాన్‌కు ఎలాంటి సలహాలు ఇచ్చారు?

ఇమ్రాన్ ఖాన్ హెలికాప్టర్‌లో శనివారం (నవంబర్ 26) రావల్పిండి చేరుకున్నారు. ఆయన వెంట వైద్యుల బృందం కూడా ఉంది. మాజీ ప్రధాని ఖాన్ లాహోర్ నుండి బయలుదేరినప్పుడు.. అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, గాయాలు ఇంకా మానలేదని, పూర్తిగా విశాంత్రి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. కానీ, వారి మాటాలు పట్టించుకోకుండా ర్యాలీలో పాల్గొన్నారని  పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ప్రతినిధులు  తెలిపారు. చావును దగ్గరగా చూసినందుకే ముందుకు వెళ్లానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. జీవించాలనుకుంటే.. మరణ భయాన్ని విడిచిపెట్టాలని కార్యకర్తలకు సూచించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !