అమెరికాలో ఇమ్రాన్‌కు నిరసన సెగ

By narsimha lodeFirst Published Jul 22, 2019, 6:16 PM IST
Highlights

అమెరికాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు నిరసనల సెగ తాకింది. పాక్ లోని బలూచిస్తాన్ కు అనకూలంగా కొందరు యువకులు నినాదాలు చేశారు.

వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నిరసనలు స్వాగతం పలికాయి.అమెరికాలోని పాక్ ప్రజలను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్న సమయంలో కొందరు పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వతంత్ర బలూచిస్తాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

 

Baloch activists disrupt Pakistan PM Imran Khan's speech during a community event in Washington DC, USA. pic.twitter.com/S9xdXF1yt8

— ANI (@ANI)

స్వతంత్ర బలూచిస్తాన్ ఏర్పాటు చేయాలని యువకులు నినాదాలు చేశారు. దీంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఇమ్రాన్ మద్దతుదారులు వారిని బయటకు పంపారు. నిరసనకు దిగిన యువకులు ఇమ్రాన్ కాన్ ప్రసంగిస్తున్న వేదికకు చాలా దూరంగా ఉన్నారు.  కానీ, యువకుల నినాదాల కారణంగా  కొంతసేపు సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ వాసులు ప్రత్యేక దేశం కోసం చాటా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. పాక్ భద్రతా బలగాలు ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఉద్యమకారుల్ని అపహరిస్తున్నారని అమెరికాలోని బలూచిస్తాన్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచిస్తాన్ లో  సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికాలో నివాసం ఉంటున్న బలూచిస్తాన్  వాసులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 


 

click me!