హైతిలో కుప్పకూలిన విమానం... ఒక్కరు కూడా మిగలకుండా దుర్మరణం

By Arun Kumar PFirst Published Jul 4, 2021, 8:36 AM IST
Highlights

హైతి రాజధాని పోర్టో ప్రిన్స్ నుండి బయలుదేరిన ప్రైవేట్ విమానం ఒకటి మార్గమధ్యలో కుప్పకూలింది.

కరీబియన్ దీవుల్లోని హైతిలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. హైతి రాజధాని పోర్టో ప్రిన్స్ నుండి బయలుదేరిన ప్రైవేట్ విమానం ఒకటి మార్గమధ్యలో కుప్పకూలింది. పోర్టో ప్రిన్స్ కు దక్షిణ ప్రాంతంలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు అమెరికన్లు కూడా వున్నారు. 

వివరాల్లోకి వెళితే... శుక్రవారం సాయంత్రం హైతి రాజధాని పోర్టో ప్రిన్స్ నుండి ఆరుగురితో ప్రైవేట్ జెట్ జాక్మెల్ నగరానికి బయలుదేరింది. అయితే టెకాఫ్ అయిన గంటసేపటి తర్వాత విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అందులో ప్రయానిస్తున్నవారంతా మరణించారు. 

read more  ఫ్లోరిడాలో కుప్పకూలిన భవనం: నలుగురి మృతి, 159 మంది గల్లంతు

విమానం నుండి సంబంధాలు తెగిపోగానే ఎయిర్ లైన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అధికారులు, సహాయక బృందాలు ప్రమాద ప్రాంతానికి చేరుకున్నా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది చనిపోయారు. సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే విమానం కూలిపోయినట్లు నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీషియల్స్ తెలిపారు. 

 

click me!