స్కూల్ ఎగ్గొట్టడానికి ఇంత పెద్ద ప్లానా..?

By telugu news teamFirst Published Jul 3, 2021, 12:00 PM IST
Highlights

కరోనా టెస్టుల్లో ఫేక్ రిపోర్టులు క్రియేట్ చేసి స్కూల్ యాజమాన్యాలకు పంపుతూ ఎంచక్కా ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. 

స్కూల్, కాలేజ్ ఎగ్గొట్టి.. షికార్లు చేయడానికి పిల్లలు చాలా చాలా ప్లాన్సే వేస్తుంటారు.  జ్వరం వచ్చిందనో.. ఇంకేదో ఇంకేదో కారణాలు చెబుతుంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. బ్రిటన్ లో మాత్రం కొందరు విద్యార్థులు స్కూల్ ఎగ్గొట్టడానికి కొత్త పద్దతులు వాడుతున్నారు.

దీనికి సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ వీడియోలను ఉపయోగించుకోవడం గమనార్హం. అందులోని వీడియోలు చూసి కొందరు కరోనా టెస్టుల్లో ఫేక్ రిపోర్టులు క్రియేట్ చేసి స్కూల్ యాజమాన్యాలకు పంపుతూ ఎంచక్కా ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారించుకుని ఇలా బ్రిటన్ టీనేజర్లు స్కూళ్లు ఎగ్గొడుతున్నారు. 

ఇక కొవిడ్ టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చేందుకు టిక్‌టాక్‌ వీడియోల్లో చూపించినట్లు నిమ్మరసం, వెనిగర్‌ను వినియోగిస్తున్నారు. దీంతో వైరస్ సోకని వారికి కూడా యాంటీజెన్ టెస్టుల్లో పాజిటివ్‌గా చూపిస్తోంది. టీనేజర్లు అనుసరిస్తున్న ఈ వింత పోకడల పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదించదగినది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

click me!