ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లో.. ప్రిన్స్ డయానా పెళ్లి గౌను..!

Published : Jun 03, 2021, 10:36 AM ISTUpdated : Jun 03, 2021, 10:51 AM IST
ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లో..  ప్రిన్స్ డయానా పెళ్లి గౌను..!

సారాంశం

రకరకాల ఫ్యాషన్ దుస్తుల్లో ఆమె దర్శనమిచ్చేవారు. ఫ్యాషన్ దుస్తులను ధరించేందుకు బ్రిటన్ రాయల్ డ్రెస్ కోడ్‌ను కూడా ఆమె ఉల్లంఘించడం గమనార్హం. 

రాజకుటుంబానికి చెందిన బ్రిటన్ యువరాణి డయానా గురించి ఎంతో కొంతో అందరూ వినే ఉంటారు. ఆమె పేరు వినపడగానే.. ఆమె గురించి అవగాహన ఉన్నవారందరికీ ఒక్కసారిగా అందమైన ఆమె రూపం కళ్లకు కట్టినట్లు కనపడుతుంది. చిన్న వయసులోనే ఆమె  చనిపోయారు. ఆమె మరణం పై కూడా ఎన్నో వార్తలు వినే ఉంటారు. బ్రిటన్‌ వాసుల మనసుల్లో ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ తాజాగా ఉంటాయి. 

కాగా.. ఫ్యాషన్ విషయంలో డయానా ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేశారు. రకరకాల ఫ్యాషన్ దుస్తుల్లో ఆమె దర్శనమిచ్చేవారు. ఫ్యాషన్ దుస్తులను ధరించేందుకు బ్రిటన్ రాయల్ డ్రెస్ కోడ్‌ను కూడా ఆమె ఉల్లంఘించడం గమనార్హం. అన్నింట్లోనూ ఆమె పెళ్లిలో ధరించిన గౌన్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాగా.. ఇప్పుడు ఆ గౌన్ ని ఫ్యాషన్ ప్రదర్శనలో ఉంచడం గమనార్హం.

ఈ గౌను పొడవు 25 అడుగులు కావడం గమనార్హం. రాజవంశ చరిత్రలో ఇదే పొడవైన డ్రెస్ కావడం విశేషం. ప్రిన్సెస్ డయానా పెళ్లి దుస్తులను అప్పటి ప్రఖ్యాత బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్లు డేవిడ్, ఎలిజబెత్ ఇమాన్యుయేల్ రూపొందించారు. 1981లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన ప్రిన్స్ చార్లెస్‌తో ఆమె పెళ్లి జరిగింది. ఈ వేడుకల్లో డయానా తెల్లని గౌను ధరించారు. అప్పట్లో ఈ మ్యారేజ్ డ్రెస్ వార్తల్లో నిలిచింది. అద్బుతమైన ఈ డ్రెస్‌ను ధరించడానికి డయానా రాయల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు.

కాగా.. ఇప్పుడు ఈ గౌనును అందరూ చూసేవిధంగా ప్రదర్శనకు ఉంచుతుండటం విశేషం. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో ప్రదర్శించనున్నారు. 25 సంవత్సరాల తరువాత ఈ గౌనును ప్రదర్శనకు ఉంచడం విశేషం. వీటిని చివరిసారిగా 1995లో లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో ప్రదర్శించారు.

‘రాయల్ స్టైల్ ఇన్ ది మేకింగ్’ పేరుతో జరగనున్న ఈ ప్రదర్శన, 2021 జూన్ 3న ప్రారంభం కానుంది. ఇది 2022 జనవరి2 వరకు కొనసాగుతుంది.

PREV
click me!

Recommended Stories

Ciel Tower : సామాన్యులకు అందనంత ఎత్తు.. ఈ హోటల్‌లో ఒక్క రోజు గడపాలంటే ఆస్తులు అమ్మాల్సిందేనా?
VENEZUELA: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..వెనిజులా పరిస్థితి ఇదే