ఆ కంపెనీల టీకా తీసుకున్న ప్రయాణికుల విషయంలో.. సౌదీ కీలక నిర్ణయం..!

By AN TeluguFirst Published Jun 2, 2021, 11:13 AM IST
Highlights

వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికుల విషయంలో గల్ఫ్ దేశం సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. టీకా వేయించుకున్న ప్రయాణికులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీఏసీఏ) ప్రకటించింది.

అయితే, స్వదేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు జారీ చేసిన సర్ఠిఫికేట్ చూపించడం తప్పనిసరి అని జీఏసీఏ పేర్కొంది. అలాగే ఫైజర్-బయోఎన్ టెక్, మోడెర్నా, ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఇక వ్యాక్సిన్ వేయించుకోని విదేశీ ప్రయాణికులకు విధించిన ఏడు రోజు క్వారంటైన్ నిబంధనలో ఎలాంటి మార్పు లేదని ఈ సందర్భంగా జీఏసీఏ వెల్లడించింది. 

click me!