చైనాలో కలకలం: మనిషికి సోకిన బర్డ్‌ఫ్లూ

By narsimha lodeFirst Published Jun 1, 2021, 5:11 PM IST
Highlights

చైనాలోని వూహాన్ లో వెలుగు చూసిన  కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా డ్రాగన్ కంట్రీలో  బర్డ్ ఫ్లూ మనిషికి సోకింది. ప్రపంచంలోనే ఈ కేసు తొలికేసుగా ఆ దేశం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య  కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) మంగళవారం తెలిపింది.

బీజింగ్:: చైనాలోని వూహాన్ లో వెలుగు చూసిన  కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా డ్రాగన్ కంట్రీలో  బర్డ్ ఫ్లూ మనిషికి సోకింది. ప్రపంచంలోనే ఈ కేసు తొలికేసుగా ఆ దేశం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య  కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) మంగళవారం తెలిపింది.

హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ వ్యాపించిందని వెల్లడించింది. ఈ కేసు నమోదు కాగానే వైద్య ఆరోగ్యశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల పురుషుడికి బర్డ్‌ ఫ్లూ సోకిందని జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది.ప్రపంచంలోనే తొలిసారిగా బర్డ్‌ ఫ్లూ కేసు తమ దేశంలోనే మానవుడికి సోకిందని కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) వారం కింద రక్త పరీక్షలు చేయగా అతడికి బర్డ్‌ ఫ్లూ సోకిందని ఫలితాల్లో నిర్ధారైనట్టుగా తెలిపింది.

అతడికి బర్డ్‌ ఫ్లూ సోకడంతో వెంటనే అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు అతడికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అతడి ఎవరెవరిని కలిశారో వారిని గుర్తించి వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని జాతీయ ఆరోగ్య కమిషన్‌ స్పష్టం చేసింది.
 

click me!