అద్భుతంగా పాలన సాగించా: వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు

Published : Jan 20, 2021, 07:38 PM IST
అద్భుతంగా పాలన సాగించా: వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు

సారాంశం

 తన పాలన అద్భుతంగా సాగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీడ్కోలు  కార్యక్రమం వైట్ హౌస్ సమీపంలోని ఆండ్రూస్ జాయింట్ బేస్ వద్ద బుధవారం నాడు నిర్వహించారు.

వాషింగ్టన్: తన పాలన అద్భుతంగా సాగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీడ్కోలు  కార్యక్రమం వైట్ హౌస్ సమీపంలోని ఆండ్రూస్ జాయింట్ బేస్ వద్ద బుధవారం నాడు నిర్వహించారు.

తన పాలన కాలంలో  చేసిన పనులన్నీ అద్భుతంగా ఉన్నాయని ఆయన చెప్పారు. సాధారణ పాలన తనది కాదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  అసాధ్యం కాదని ప్రజలు అనుకొన్న పనులను కూడ తాము చేసినట్టుగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

కొత్త అడ్మినిస్ట్రేషన్ పన్నులు పెంచరని ఆశిస్తున్నానని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అమెరికా ప్రథమ మహిళ కావడం గొప్ప గౌరవమని మెలానియా ట్రంప్ చెప్పారు. దేవుడు ఈ దేశాన్ని ఆశీర్వదించాలని ఆమె కోరుకొన్నారు.

ఈ కార్యక్రమం తర్వాత ట్రంప్ దంపతులు వైట్ హైస్ ను వదిలి వెళ్లిపోయారు. సాధారణంగా  కొత్త అధ్యక్షుడి దంపతులు పాత దంపతులు స్వాగతం పలకడం సంప్రదాయం. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా ట్రంప్ దంపతులు వైట్ హౌస్ ను వీడి వెళ్లిపోయారు.
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !