స్వలింగ సంపర్క జంటకు స్వర్గథామం: ఆ జంటకు చిక్కులు తెచ్చిన ట్వీట్

By narsimha lodeFirst Published Jan 20, 2021, 6:24 PM IST
Highlights

 స్వలింగ సంపర్క జంటల విషయంలో ఓ యువతి చేసిన ట్వీట్ ఆమెను కష్టాల్లో నెట్టింది. దేశం విడిచివెళ్లాల్సిన పరిస్థితులు ఆమెకు నెలకొన్నాయి. 

జకార్తా: స్వలింగ సంపర్క జంటల విషయంలో ఓ యువతి చేసిన ట్వీట్ ఆమెను కష్టాల్లో నెట్టింది. దేశం విడిచివెళ్లాల్సిన పరిస్థితులు ఆమెకు నెలకొన్నాయి. 

స్వలింగ సంపర్క జంటకు ఇండోనేషియా స్వర్గథామమని ఓ యువతి సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ ప్రకటన ఆమెను కష్టాల్లోకి నెట్టింది. గర్ల్‌ఫ్రెండ్ తో కలిసి ఆమె దేశం వీడి వెళ్లాల్సి వచ్చింది.

అమెరికాకు చెందిన క్రిస్టిన్ గ్రే అనే యువతి తన ప్రేయసి సాండ్రాతో కలిసి కొన్ని నెలల క్రితం బాలికి వెళ్లింది. అక్కడే  నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. అంతేకాదు ఆదాయ మార్గాలను కూడ వెతుక్కొన్నారు. 

బాలిలో జీవన విధానం అక్కడ అవుతున్న ఖర్చు, పొందుతున్న సౌకర్యాలు ఇతర అంశాల గురించి అవర్ బాలి లైఫ్ ఈజ్ యువర్స్ పేరిట పుస్తకం రాశారు. 

గ్రాఫిక్ డిజైనర్ ఈ పుస్తకాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ బుక్ లో పొందుపర్చిన అంశాలు వివాదంగా మారాయి. బాలిలో అతి తక్కువ ఖర్చుకే విలాసవంతమైన జీవితం గడపొచ్చని పేర్కొన్నారు. ఎల్జీబీటీ కమ్యూనిటీ ఇక్కడ హాయిగా జీవించవచ్చని క్రిస్టినా పేర్కొంది.

బాలికి ఆమె ఎలా వచ్చిందో .. వీసా ఎలా సంపాదించిందో రాసింది. ఈ మేరకు ఓ లింక్ ను షేర్ చేసింది. ఈ విషయమై న్యాయశాఖ స్పందించింది. క్రిస్టిన్,ఆమె సహచరి ఉద్దేశ్యపూర్వకంగా తమకు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొన్నట్టుగా అనుమానిస్తున్నట్టుగా తెలిపింది. బాలి సంస్కృతిని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ జంటను అమెరికాకు పంపుతామని ఆ దేశం ప్రకటించింది. ఈ మేరకు న్యాయప్రక్రియను పూర్తి చేస్తున్నట్టుగా తెలిపింది. ఇక స్థానిక ఎల్జీబీటి కమ్యూనిటీ సైతం క్రిస్టిన్ తీరును తప్పుబట్టింది.

click me!