మాల్దీవుల్లో మాయమైన భార్య.. ఆచూకీ తెలిపితే రూ. 70 లక్షలు ప్రకటించిన భర్త...

Published : Feb 24, 2021, 11:05 AM IST
మాల్దీవుల్లో మాయమైన భార్య.. ఆచూకీ తెలిపితే రూ. 70 లక్షలు ప్రకటించిన భర్త...

సారాంశం

దుబాయ్ నుంచి వచ్చిన ఓ జంటకు మాల్దీవుల్లో విషాదం ఎదురయ్యింది. భార్య కనిపించకుండా పోయింది. దీంతో తన భార్యను వెతికిపెడితే లక్ష డాలర్లు అంటే రూ. 72.37 లక్షలు ఇస్తానని భర్త పర్మార్ గుర్షరాంజీత్ సింగ్ రివార్డ్ ప్రకటించాడు. 

ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. పర్మార్, తన భార్య గియడ్రే వాస్కైట్ (33) కొద్ది రోజుల కిందట మాల్గీవులకు ట్రిప్ కు వచ్చారు. ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం గియడ్రే కనిపించకుండా పోయింది. భర్త, అధికారులు ఎంత వెతికినా గియడ్రే ఆచూకీ మాత్రం దొరకలేదు. 

వారం రోజులపాటు వెతికినా తన భార్య ఆచూకీ దొరక్కపోవడంతో పర్మార్ దుబాయ్ కి తిరిగి వెళ్లిపోయాడు. ఆమె అదృశ్యమయ్యేనాటికి గర్భిణి. దీంతో ప్రెగ్రెంట్ గా ఉన్న తన భార్య నీళ్లలో మునిగిపోయిందా లేక కిడ్నాప్‌కు గురైందా లేక ఏమైనా జరిగిందా అనేది తనకు అర్థం కావడం లేదని పర్మార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అయితే తన భార్య నీళ్లలోనే మునిగిపోయి ఉండొచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారని, కానీ తన భార్య స్విమ్మర్ అని, ఆమె అంత తేలిగ్గా నీళ్లలో మునిగిపోదని పర్మార్ చెబుతున్నాడు. 

పోలీసులు చెబుతున్నట్టు నిజంగానే తన భార్య నీళ్లలో మునిగినా వారం రోజులైనా మృతదేహం ఎందుకు పైకి తేలలేదని పర్మార్ ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు రివార్డ్ ప్రకటించడంతో తన బార్య దొరుకుతుందని ఆశపడుతున్నట్లు పర్మార్ తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే