రష్యాలో భూకంపం: సునామీ హెచ్చరికలు

Published : Mar 25, 2020, 02:23 PM IST
రష్యాలో భూకంపం: సునామీ హెచ్చరికలు

సారాంశం

రష్యా కురిల్ దీవుల్లో బుధవారం నాడు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

మాస్కో: రష్యా కురిల్ దీవుల్లో బుధవారం నాడు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

జపాన్ కు ఉత్తరాన ఉన్న కురిల్ దీవులకు సెవెరోకు 135 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా భూగర్భశాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ భూకంప కేంద్రానికి 620 మైళ్ల దూరంలో సునామీ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేమని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరించింది.

ఈ తరహ భూకంపాల కారణంగా సునామీలు సంభవించిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు.భూమికి 56 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని అమెరికా భూగర్భశాస్ర్తవేత్తలు తేల్చిచెప్పారు.

హవాయి రాష్ట్రానికి సునామీ హెచ్చరికలను జారీ చేసినట్టుగా అధికారులు ప్రకటించారు.హవాయి, జపాన్, రష్యా, పసిఫిక్ దీవుల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?