
న్యూఢిల్లీ: వాటికన్ సిటీలో మతాధికారులు, క్రైస్తవ మతం గురించి బోధనలు వింటున్న వారిని ఉద్దేశిస్తూ పోప్ ఫ్రాన్సిస్ కీలక విషయాలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రకటన బుధవారం వాటికన్ పబ్లిష్ చేసింది. అందులో పోర్న్ గురించి కీలక హెచ్చరికలు ఉన్నాయి. పోర్న్ టెంప్టేషన్ పవిత్రమైన హృదయాన్ని బలహీనపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
వాటికన్‌లో సోమవారం ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మత పూజారులు, అభ్యసిస్తున్నవారిని ఉద్దేశిస్తూ 86 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ పోర్నోగ్రఫీ చాలా తీవ్రమైన విషయం అని వివరించారు. డిజిటల్, సోషల్ మీడియాలో క్రైస్తువులుగా తమ సంతృప్తిని వెలువరించే సందేశాలు పెట్టవచ్చునా? అనే అంశాన్ని ఆయన ముందు లేవనెత్తారు. దీనికి ఆయన ఈ డిజిటల్, సోషల్ మీడియా ప్రపంచం గురించి ప్రమాద హెచ్చరికలు చేశారు.
ఎప్పుడూ వార్తలు చూడటం, మ్యూజిక్ వినడం వంటివి ఒకరిని వారి పని నుంచి దూరంగా చేసేలా, లేదా పరధ్యానులను చేసేలా మారుస్తుందని అన్నారు. ఇందుకు సంబంధించి మరో విషయం కూడా ఉన్నదని తెలిపారు. అదే డిజిటల్ పోర్నోగ్రఫీ అని వివరించారు.
Also Read: పెళ్లికి ముందు సెక్స్ కి నో చెబితే... పోప్ ఫ్రాన్సిస్ వివాదాస్పద కామెంట్స్..!
ఇలాంటి అనుభవాలు ఇది వరకే ఉన్నవారు లేదా డిజిటల్ పోర్నోగ్రఫీతో టెంప్టేషన్ ఉన్నవారు ఆలోచించాలని తెలిపారు. ఇది ఒక పాపం అని స్పష్టం చేశారు. చాలా మంది సామాన్య ప్రజలు, చర్చికి వచ్చే ఆరాధకులు, మతాధికారులు, సన్యాసులు కూడా ఈ పాపం బారిన పడ్డారని వివరించారు.
తాను కేవలం చైల్డ్ అబ్యూజ్ వంటి క్రిమినల్ పోర్నోగ్రఫీ మాట్లాడటం లేదని, ఇలాంటి కేసులు మనం చాలా వరకు నేరుగానే తెలుసుకోగలుగుతున్నాం అని వివరించారు. ఇవి రాను రాను తగ్గిపోతున్నామనే సమచారాన్ని ఇచ్చారు. అయితే, అత్యంత ప్రమాదకరంగా నార్మల్ పోర్నోగ్రఫీ ఉన్నదని తెలిపారు.
పోప్ ఫ్రాన్సిస్ గతంలోనూ పోర్నోగ్రఫీ పై ప్రమాద హెచ్చరికలు చేశారు. జూన్‌లోనూ ఇలాంటి వార్నింగ్‌లు ఇచ్చారు. పోర్న్ వల్ల పురుషులు లేదా మహిళల డిగ్నిటీపై శాశ్వత దాడికి గురవుతారని వివరించారు. ఇది ప్రజా ఆరోగ్యానికే ప్రమాదకరం అని తెలిపారు.
డియర్ బ్రదర్స్.. దీనిపై బీ కేర్‌ఫుల్‌గా ఉండండి. పరిశుద్ధమైన హృదయం, జీసస్‌ను ప్రతి రోజూ స్వీకరించే హృదం ఇలాంటి పోర్నోగ్రఫిక్ సమాచారాన్ని స్వీకరించలేదు అని తెలిపారు.
‘దెయ్యం అనేది ఇలాంటి చోట నుంచే ప్రవేశిస్తుంది. ఇది మీ పవిత్రమైన హృదయాన్ని క్షీణింపజేస్తుంది. పోర్నోగ్రఫీ గురించి లోతుగా చర్చిస్తున్నందుకు క్షమించాలి. కానీ, ఇదే వాస్తవం’ అని వివరించారు.
ఆడియెన్స్‌ను ఉద్దేశిస్తూ సెల్ ఫోన్ల నుంచి వీటిని డిలీట్ చేయాలని సూచించారు. దాని వల్ల మీరు మీ టెంప్టేషన్‌ను మీ చేతిలోనే వెంబడి పెట్టుకోలేరు కదా అని వివరించారు.