2014లో ప్రధాని మోడీకి ఇలాంటి రక్షణే ఇచ్చాం: సౌదీ క్రౌన్ ప్రిన్స్ పై ప్రశ్నలకు అమెరికా సమాధానం

By Mahesh KFirst Published Nov 19, 2022, 5:06 PM IST
Highlights

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పై ఎదుర్కొంటున్న ప్రశ్నలకు అమెరికా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉదాహరణగా తీసుకుని సమాధానం ఇచ్చింది. ప్రముఖ జర్నలిస్టు జమాల్ కషోగి హత్య పై మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను విచారించకుండా ఎలా రక్షణ కల్పించారని ప్రశ్నించగా, 2014లో ప్రధాని మోడీకి కూడా ఇలాంటి రక్షణే ఇచ్చాం అని తెలిపింది.
 

న్యూఢిల్లీ: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను అమెరికాలో విచారించకుండా ఎలా మినహాయించారని అమెరికాపై ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలకు సమాధానంగా భారత ప్రధాని మోడీని అమెరికా ఉదహరించారు. అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ జర్నలిస్టు జమాల్ కషోగీ హత్యపై సౌదీ అరేబియా పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఓ సౌదీ అరేబియా ప్రభుత్వ కార్యాలయం వెళ్లి మళ్లీ బయటకు రాలేదు. అక్కడే ఆయనను హతమార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయనను విచారించకుండా అమెరికా ఎలా రక్షణ కల్పించిందనే ప్రశ్నలు ఈ సందర్భంగా వచ్చాయి. 

Also Read: ఎన్నికల ప్రచారంలో గుజరాత్ అల్లర్ల దోషి.. బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న కూతురి కోసం క్యాంపెయిన్

దీనికి సమాధానం చెబుతూ అమెరికా ఇలా చేయడం ఇదేం తొలిసారి కాదని వేదాంత్ పటేల్ వివరించారు. ఇది చాలా పెద్ద జాబితా అని పేర్కొన్నారు. గతంలో చాలా మంది ప్రభుత్వ పెద్దలకు విచారణ నుంచి ఇలాంటి రక్షణ కల్పించామని తెలిపారు. ఇందుకు ఉదాహరణలు ఇస్తూ 1993లో హైతీ అధ్యక్షుడు అరిస్టైడ్, 2001లో జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే, 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 2018లో డీఆర్సీ ప్రెసిడెంంట్ కబిలాలకూ ఇలాంటి రక్షణే కల్పించామని తెలిపారు. ఇది స్థిరంగా అమెరికా ఇతర ప్రభుత్వ అధినేతలు, విదేశాంగ మంత్రుల కోసం అమలు చేస్తున్న పాలసీ అని వివరించారు.

2002లో గుజరాత్ అల్లర్లను ఆపడానికి అప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదనే ఆరోపణల కింద 2005లో ఆమె వీసాపై అమెరికా బ్యాన్ విధించింది. 2014లో భారత ప్రధానిగా ఎన్నికయ్యే వరకు ఈ నిషేధం కొనసాగింది. కానీ, అప్పటికే యూకే, ఈయూలు ఈ బాయ్‌కాట్‌ను ఎత్తేశాయి.

అయితే, గుజరాత్ అల్లర్లపై అప్పటి సీఎం, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న ఆరోపణలు అన్నింటినీ కోర్టు క్లియర్ చేసింది.

click me!