భూటాన్‌లో మోడీ టూర్: ఇండియా జెండాలతో స్వాగతం

By narsimha lodeFirst Published Aug 17, 2019, 6:41 PM IST
Highlights

రెండు రోజుల పర్యటనకు భారత ప్రధాని మోడీ శనివారం నాడు భూటాన్ వెళ్లారు. 9 అంశాలపై భారత్, భూటాన్ దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి.


పారా: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు భూటాన్ చేరుకొన్నాడు. ఇవాళ ఉదయం మోడీకి భూటాన్ ప్రధాని లొటాయ్ షెరింగ్ ఘనంగా స్వాగతం పలికారు.

భూటాన్ సాయుధ బలగాల గౌరవ వందనాన్ని మోడీ స్వీకరించారు. మోడీకి భారత జాతీయ పతాకాలను చేతబూని స్థానికులు స్వాగతం పలికారు.రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భూటాన్ పర్యటించడం మోడీ మొదటిసారి.

భూటాన్ లో తనకు సాదర స్వాగతం పలకడంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సంతోషాన్ని మోడీ ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.రెండు దేశాలు తొమ్మిది అంశాలపై ఒప్పంాలను చేసుకోనున్నాయి.
 

click me!