Modi France Visit : మోడీతో ఛానెల్ సీఈవో లీనా నాయర్‌ భేటీ.. ఖాదీని పాపులర్‌ చేయడంపై చర్చ

Siva Kodati |  
Published : Jul 14, 2023, 09:29 PM ISTUpdated : Jul 14, 2023, 09:30 PM IST
Modi France Visit : మోడీతో ఛానెల్ సీఈవో లీనా నాయర్‌ భేటీ.. ఖాదీని పాపులర్‌ చేయడంపై చర్చ

సారాంశం

ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఛానెల్ సీఈవో.. భారత సంతతికి చెందిన లీనా నాయర్ , ప్రముఖ ఆస్ట్రోనాట్, ఎయిరో స్పేస్ ఇంజనీర్ థామస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయయారు. 

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన , భారతదేశంలో చంద్రయాన్ మిషన్-3 దాదాపు ఒకే సమయంలో ప్రారంభమైంది. ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రోనాటిక్స్‌లో గొప్ప విజయాలు సాధించిన ప్రముఖులను ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ కలుసుకోవడానికి ఇదే కారణం. అంతరిక్షం గురించి ప్రధాని మోదీ ఏ విధంగా ఆలోచిస్తున్నారో దానికి సరైన ఉదాహరణ ఆయన ఫ్రాన్స్ పర్యటనలోనే కనిపించింది. విపత్తు నివారణ, పట్టణ ప్రణాళిక, అంతరిక్షం , నావిగేషన్ వ్యవస్థల వినియోగంపై కూడా ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ దృష్టి తొలి నుంచి ఈ విషయాలపైనే ఉంది.  ఆయన తన నాయకత్వంలో భారతదేశాన్ని సరైన మార్గంలో తీసుకెళ్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రారంభించిన భారత్ : 

భారతదేశం ఎలా మెరుగ్గా పని చేస్తుందో చెప్పడానికి చంద్రయాన్-3 మిషన్ జూలై 14న ప్రయోగించడమే ఉదాహరణ. భారతదేశం LVM3 రాకెట్ మూడవ దశను పూర్తి చేసింది. ఎల్‌వీఎం 3 రాకెట్‌ నుంచి చంద్రయాన్‌ 3ని వేరు కావడంతో చంద్రయాన్-3 అంతరిక్షంలోకి విజయవంతంగా చేరింది. ఇప్పుడు చంద్రయాన్ 3 దాని ఇంజిన్ ఆధారంగా చంద్రుని వరకు ప్రయాణాన్ని పూర్తి చేయనుంది. చంద్రయాన్ 2023 ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించనుంది. 23 అక్టోబర్ 2023న చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇస్రో అధికారులు తెలిపారు.

ప్రధాని మోదీని కలిసిన తర్వాత లీనా నాయర్ ఏం చెప్పారంటే :

ఛానెల్ సీఈవో.. భారత సంతతికి చెందిన లీనా నాయర్ ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని మోదీని కూడా కలిశారు. భారతదేశ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా చికంకారి చేతి కళాకారులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ప్రత్యేక చర్చలు జరిగాయని లీనా పేర్కొన్నారు. ప్రధాని మోదీ - లీనా నాయర్‌ల సమావేశంలో ఖాదీని భారతదేశంలో ఎలా గ్లోబల్ బ్రాండ్‌గా మార్చవచ్చో కూడా చర్చించారు.

 

 

ఏరోస్పేస్ ఇంజనీర్ , వ్యోమగామి థామస్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ అంతరిక్షం గురించి సరైన రీతిలో ఆలోచిస్తున్నారని.. స్పేస్ నావిగేషన్ సిస్టమ్, విపత్తు నివారణ, పట్టణ ప్రణాళికపై అంతరిక్ష సేవలను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారని థామస్ అన్నారు. మనుషులను అంతరిక్షంలోకి పంపడం చాలా కష్టమని.. భారత్ దీన్ని అద్భుతమైన వేగంతో చేస్తోందని ఆయన ప్రశంసించారు. అలాగే చంద్రయాన్‌ని ప్రారంభించినందుకు భారతదేశానికి ఆయన అభినందనలు తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే