యూఏఈలోని బుర్జ్ ఖలీఫాపై ప్రధాని మోడీ చిత్రం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ (Video)

Published : Jul 15, 2023, 06:55 PM IST
యూఏఈలోని బుర్జ్ ఖలీఫాపై ప్రధాని మోడీ చిత్రం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ (Video)

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూఏఈకి పర్యటించిన సందర్భంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ఒక రోజు ముందే అంటే శుక్రవారం రాత్రే బుర్జ్ ఖలీఫాపై చిత్రాలను ప్రదర్శించారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరంద్ర మోడీకి స్వాగతం అంటూ వేశారు. అనంతరం, జాతీయ పతాకం, ప్రధాని మోడీ చిత్రాలనూ ఆ టవర్ పై ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని యూఏఈలో ఈ రోజు ఉదయం అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనను అబుదాబిలోని విమానాశ్రయంలో షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్ ఘనంగా స్వాగతించారు. ప్రధాని మోడీ యూఏఈలో అడుగు పెట్టడానికి ముందే అక్కడి ప్రసిద్ధ టవర్ బుర్జ్ ఖలిఫాపై ఆయన చిత్రాన్ని ప్రదర్శించారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం అంటూ బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. అనంతరం, జాతీయ జెండాను ప్రదర్శించి చివరకు ప్రధాని మోడీ చిత్రాన్ని చూపించారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేంద్ర మంత్రులు సైతం ఈ వీడియోలను షేర్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక భవనంపై త్రివర్ణ పతాకం, మోడీ చిత్రాలు కనిపించడం చాలా మందిని సంతోషపెట్టింది.

ప్రధాని మోడీ యూఏఈలో అడుగు పెట్టిన తర్వాత షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్‌తో సమావేశమయ్యారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా యూఏఈకి ప్రధాని వెళ్లారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల మధ్య  కీలక ఒప్పందాలు జరిగాయి. ఉభయ దేశాల మధ్య వాణిజ్య 85 బిలియన్ యూఎస్ డాలర్లకు తొలిసారిగా చేరుకుందని ప్రధాని మోడీ వివరించారు. యూఏఈతో భారత సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ఈ వాణిజ్యం జీ20 సదస్సుకు ముందే 100 బలియన్ల అమెరికన్ డాలర్లకు చేరాలని ఆశించారు.

Also Read: ఆంధ్రావాళ్ల పైసలతో టీఆర్ఎస్ పెట్టారు.. టీడీపీ సహాయంతోనే కేటీఆర్ ఎమ్మెల్యే.. మీరు పరాన్నజీవులు: రేవంత్ ఫైర్

అలాగే.. ఈ పర్యటనలో ఉభయ దేశాల మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. ఈ రెండు దేశాల స్థానిక కరెన్సీ(ఇండియన్ రూపీ, యూఏఈ దిర్హన్)ని ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. తద్వారా ఈ రెండు దేశాలు తమ సరిహద్దు దాటి ఎదుటి దేశంలో కూడా సులభతరంగా వాణిజ్యం చేయడానికి వీలుకానుంది. ఈ ఒప్పందంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖాలేద్ మొహమద్ బలామాలు సంతకాలు చేశారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే