
ఖాాట్మాండ్: Nepal కు చెందిన తారా ఎయిర్ కు చెందిన 9 ఎన్‌ఎఈటీ ట్విన్ ఇంజన్ విమానం ఏటీసీతో సంబంధాలు తెగిపోయింది. ఈ విమానంలో 22 మంది ప్రయాణీకులున్నారు. నలుగురు భారతీయులు, ముగ్గురు జపనీస్ పౌరులతో సహా పోఖారా నుండి నేపాల్ లోని జోమ్ సోమ్ కు ప్రయాణం చేస్తున్న సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయింది. ఇవాళ ఉదయం 9:55 గంటలకు విమానం ATC తో సంబంధాలను కోల్పోయిందని అధికారులు తెలిపారు. విమానం ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ఆకాశంలో కన్పించిన తర్వాత మౌంట్ దౌలగిరి వైపు వెళ్లింది. ఆ తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని చీఫ్ డిస్ట్రిక్ట్ అధికారి నేత్ర ప్రసాద్ శర్మ చెప్పారు.
త్రిభువన్ అంతర్ాజతీయ విమానాశ్రయం నుండి విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానం ఏటీసీతో సంబంధాలు తెగిపోయింది. విమానం అదృశ్యమైందని తారా ఎయిర్ ప్రతినిధఇ సుదర్శన్ బర్తౌలా ధృవీకకరించారు. విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విమానం కోసం నేపాల్ హోంమంత్రిత్వశాఖ ముస్తాంగ్ , పోఖారా నుండి రెండు ప్రైవేట్ హెలికాప్టర్లను మోహరించింది. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ కూడా తప్పిపోయిన విమానం కోసం గాలింపు చర్యలు చేపడుతుందని హోంమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఫదీంద్ర మణి ఫోఖరేల్ ధృవీకరించారు.