ఆకాశంలో అంతటి వెలుగు చూడలేదు: పాక్ పైలట్ సంచలన ప్రకటన

By Siva KodatiFirst Published Jan 28, 2021, 2:48 PM IST
Highlights

పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరాచీ నుంచి లాహోర్‌కు వెళ్లే మార్గంలో గుర్తించడానికి వీలుకాని ఒక వస్తువును చూశానంటూ బాంబు పేల్చాడు.

పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరాచీ నుంచి లాహోర్‌కు వెళ్లే మార్గంలో గుర్తించడానికి వీలుకాని ఒక వస్తువును చూశానంటూ బాంబు పేల్చాడు.

జనవరి 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎయిర్ బస్ ఏ-320 విమానంలో వెళ్తుండగా రహిమ్ యార్ ఖాన్ ప్రాంతంలో ఈ ప్రకాశవంతమైన వస్తువును చూసినట్టు పైలట్ తెలిపాడు. అంతటి వెలుగులోనూ ఆ వస్తువు చాలా ప్రకాశవంతంగా కనిపించిందని పైలట్ పేర్కొన్నాడు.

తన దినచర్యలో భాగంగా ఉదయం సమయంలో తాము ఎన్నడూ ఇటువంటి వస్తువులను చూడలేదని పైలట్ చెప్పాడు. బహుశా తాను చూసింది గ్రహం కాకపోవచ్చు కానీ కృత్రిమ గ్రహం లేదా అంతరిక్ష కేంద్రం అయి ఉండొచ్చని పైలట్ చెప్పుకొచ్చాడు. 

మరోపక్క సదరు పైలట్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ రహిమ్ యార్ ఖాన్ ప్రాంతంలోని ప్రజలు కూడా ఈ ప్రకాశవంతమైన వస్తువును తాము కూడా చూసినట్టు చెబుతున్నారు. అంతేకాదు చాలా మంది ఈ ప్రకాశవంతమైన వస్తువును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

కాగా, పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి దీనిపై స్పందిస్తూ.. ఆ వస్తువు ఏంటనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. నిబంధనల ప్రకారం ఆకాశంలో ఓ వస్తువు కనిపించినట్టు మాత్రం తాము రికార్డుల్లో నమోదు చేసుకున్నట్టు చెప్పారు

click me!