ఇండియన్ ఎంబసీ పై ఖలీస్తానీ మద్దతుదారుల దాడి

By telugu news teamFirst Published Jan 28, 2021, 1:15 PM IST
Highlights

భార‌త దౌత్య‌వేత్త‌లు, కార్యాల‌యం భ‌ద్ర‌త అక్క‌డి ప్ర‌భుత్వ‌మే చూసుకోవాల్సి ఉంటుంది అని భార‌త ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

భారత గణతంత్ర దినోత్సవం చేసుకున్న రోజే.. ఇటలీలోని రోమ్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ పై దాడి జరిగింది.  ఇండియన్ ఎంబసీ పై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌పై భార‌త ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు ఇట‌లీ అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై మా ఆందోళ‌న వ్య‌క్తం చేశాము. 

భార‌త దౌత్య‌వేత్త‌లు, కార్యాల‌యం భ‌ద్ర‌త అక్క‌డి ప్ర‌భుత్వ‌మే చూసుకోవాల్సి ఉంటుంది అని భార‌త ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వాళ్ల‌పై ఇట‌లీ అధికారులు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఆ వ‌ర్గాలు ఆశాభావం వ్య‌క్తం చేశాయి. 

రిప‌బ్లిక్ డే నాడు అటు వాషింగ్ట‌న్‌లో ఉన్న ఇండియ‌న్ ఎంబ‌సీ బ‌య‌ట కూడా ఇండియాలో జ‌రుగుతున్న రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా ఖ‌లిస్తానీ వేర్పాటువాద గ్రూపుల స‌భ్యులు ఆందోళ‌న నిర్వ‌హించారు. ఈ ఆందోళ‌న‌లో కాషాయ ఖ‌లిస్తానీ జెండాలు ప‌ట్టుకొని, ఇండియాకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. 

click me!