ఎవరెస్ట్ శిఖరాన్ని 26 సార్లు అధిరోహించిన రెండో వ్యక్తిగా నేపాలీస్ షెర్పా పసాంగ్ దావా రికార్డ్

By Asianet NewsFirst Published May 15, 2023, 2:21 PM IST
Highlights

నేపాలీ షెర్పా పసాంగ్ దావా ఎవరెన్స్ శిఖరాన్ని 26 సార్లు అధిరోహించారు. ప్రపంచంలో 26 సార్లు ఎవరెస్ట్ అధిరోహించిన రెండో వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.
 

ఖాట్మాండ్: నేపాల్‌కు చెందిన షెర్పా పసాంగ్ దావా ప్రపంచరికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే ఎత్తైనా ఎవరెస్ట్ శిఖరాన్ని 26 సార్లు అధిరోహించిన రెండో వ్యక్తిగా నిలిచారు. ఈ మేరకు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

పాంగ్‌బోచేలో జన్మించిన దావా ప్రతి రోజూ ఎవరెస్ట్ శిఖరాన్ని చూస్తూ పెరిగారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్న కాంక్ష ఆయనలో బలంగా నాటుకుంది. 46 ఏళ్ల షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని ఏకంగా 26 సార్లు అధిరోహించారు. ఆదివారం ఉదయం 9.06 గంటలకు ఆయన తన 26వ ట్రెక్కింగ్‌ను పూర్తి చేసుకున్నారని హిమాలయన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఇమాజిన్ నేపాల్ ట్రెక్స్ ఎక్స్‌పెడిషన్ ఆర్గనైజర్  మింగ్మా గ్యాల్జే షెర్పా హిమాలయన్ టైమ్స్‌కు తెలిపారు.

Also Read: పటియాలా గురుద్వారా ప్రాంగణంలో మద్యం సేవించిన మహిళ హత్య

షెర్పా పసాంగ్ దావా తొలిసారి 1998లో, ఆ తర్వాత వరుసగా 1999, 2002, 20003, 2004, 2006లో రెండు సార్లు, 2007లో రెండు సార్లు, 2008, 2009, 2010లో రెండు సార్లు, 2011, 2012, 2013లో రెండు సార్లు, 2016, 2017, 2018లో రెండు సార్లు, 2019లో రెండు సార్లు, 2022లో రెండు సార్లు ఎవరెస్ట్‌ను ఎక్కారని గ్యాల్జే తెలిపారు.

click me!