డ్రగ్స్ ముఠాని పట్టుకున్న శాంతా క్లాజ్..!

Published : Dec 18, 2020, 10:23 AM ISTUpdated : Dec 18, 2020, 10:29 AM IST
డ్రగ్స్ ముఠాని పట్టుకున్న శాంతా క్లాజ్..!

సారాంశం

ఈ క్రమంలో తన ఇంటి ముందే ఇతరులకు మాదక ద్రవ్యాలు అమ్ముతూ అతను పోలీసుల కంటపడ్డాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఓ పథకం వేశారు


క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. క్రిస్మస్ అనగానే.. శాంతా క్లాజ్ వచ్చి అందరికీ బహుమతులు అందజేస్తారని పిల్లలు అందరూ సంబరపడతారు కూడా. కాగా.. ఓ శాంతా క్లాజ్ ఇదే విధంగా వెళ్లి ఓ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. ఈ సంఘటన పెరూలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పెరూ రాజధాని లీమాలో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతను డ్రగ్స్ అమ్ముతున్నాడని పోలీసులకు ఉప్పందింది. దీంతో అతనిపై వాళ్లు నిఘా పెట్టారు. ఈ క్రమంలో తన ఇంటి ముందే ఇతరులకు మాదక ద్రవ్యాలు అమ్ముతూ అతను పోలీసుల కంటపడ్డాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఓ పథకం వేశారు. ఇద్దరు ఆఫీసర్లు శాంతాక్లాజ్, అతని సహచరుడి వేషాలు వేసుకున్నారు. ఓ పెద్ద సుత్తి తీసుకొని నిందితుడి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లారు.. ఆ ఇంటిని చేరుకోగానే సుత్తితో తలుపులు బద్దలు కొట్టారు. ఈ చప్పుళ్లు విని ఆదరాబాదరాగా పరిగెత్తుకొచ్చిన నిందితుడిని బలవంతంగా అదుపులోకి తీసుకొని బేడీలు వేశారు. ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ‘‘మేం పోలీసులం. యాంటీ-డ్రగ్ ఆపరేషన్లు చేసే గ్రీన్ స్క్వాడ్ నుంచి వస్తున్నాం’’ అని శాంతాక్లాజ్ వేషంలో ఉన్న అధికారి కేకలు వేయడం పోలీసులు తీసిన వీడియోలో వినపడుతోంది.

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ