వైరల్ : కస్టమర్ పెద్ద మనసు.. పదిహేను వేల బిల్లుకు.. మూడు లక్షల టిప్పు...

By AN TeluguFirst Published Dec 17, 2020, 4:32 PM IST
Highlights

సరదాగా హోటల్ కి వెళ్లి తిన్న తరువాత టిప్ ఇవ్వాలంటే మనలో చాలామందికి మనసు రాదు.. ఇచ్చినా వంద రూపాయలలోపే ఇస్తారు. ఆ వాళ్ల సర్వీసుకి అదే ఎక్కువ అనుకునే మనస్తత్వాలే చాలా మందివి. అయితే కొంతమంది మాత్రం టిప్ విషయంలో కూడా దిల్ దార్ గా ఉంటారు. వేలకు వేలు ఇస్తుంటారు. ఇలాంటి వాళ్లు రోజుకొకరు తగిలినా ఆ వెయిటర్ల పంట పండినట్టే..

సరదాగా హోటల్ కి వెళ్లి తిన్న తరువాత టిప్ ఇవ్వాలంటే మనలో చాలామందికి మనసు రాదు.. ఇచ్చినా వంద రూపాయలలోపే ఇస్తారు. ఆ వాళ్ల సర్వీసుకి అదే ఎక్కువ అనుకునే మనస్తత్వాలే చాలా మందివి. అయితే కొంతమంది మాత్రం టిప్ విషయంలో కూడా దిల్ దార్ గా ఉంటారు. వేలకు వేలు ఇస్తుంటారు. ఇలాంటి వాళ్లు రోజుకొకరు తగిలినా ఆ వెయిటర్ల పంట పండినట్టే..

ఇప్పుడిదంతా ఎందుకంటే వాషింగ్టన్ లోని ఓ రెస్టారెంట్ లో పనిచేసే వెయిట్రెస్ కి ఏకంగా ఓ వ్యక్తి మూడు లక్షల రూపాయలు టిప్ గా ఇచ్చాడు. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే.. చెస్టర్లోని వైడెనర్‌ విశ్వవిద్యాలయంలో నర్సింగ్‌ చదవుతోన్న జియానా డి ఏంజెలో పెన్సిల్వేనియాలోని ఓ ఇటాలియన్‌ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పార్ట్‌ టైం వర్క్‌ చేస్తోంది. ఈ క్రమంలో శనివారం ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కి వచ్చి.. ఫుడ్‌ ఆర్డర్‌ చేసి తిన్నాడు. వెల్తూ వెల్తూ.. ఏకంగా 5000 డాలర్లు టిప్పుగా ఇచ్చాడు. మన కరెన్సీలో చెప్పాలంటే 3,67,287 రూపాయలన్న మాట. 

ఇంతకీ అతను తిన్నదానికి అయిన బిల్లు 205 డాలర్లు అంటే రూ.15,058. జియానా బిల్‌ తీసుకొచ్చి ఇచ్చాక.. కాసేపటికి సదరు కస్టమర్‌ 5,205 డాలర్లు టెబుల్‌ మీద పెట్టి వెళ్లాడు. జియానా వచ్చి చూడగా.. ఐదు వేల డాలర్లు అదనంగా కనిపించాయి. మర్చిపోయాడేమో అనుకుని జియానా అతని గురించి వెతికింది. కానీ అప్పటికే  కస్టమర్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. 

దాంతో అతడు కావాలనే ఆ డబ్బును అక్కడ పెట్టాడని, అది టిప్పుగా ఇచ్చిన మొత్తం అని అర్థం అయ్యింది. అలాగని జియానా ఆ డబ్బు తీసుకుని గప్ చిప్ గా ఊరుకోలేదు. ఆ విషయం రెస్టారెంట్‌ యాజమాన్యానికి చెప్పింది. ఆశ్చర్యపోయిన యాజమాన్యం బిల్‌ పేపర్‌ని ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. 

దాని మీద బిలు దగ్గర 205 డాలర్లు ఉండగా.. టిప్పు దగ్గర 5,000 అని రాసి ఉంది. మొత్తం 5,205 డాలర్లుగా చూపిస్తుంది. ఇంత భారీ మొత్తాన్ని టిప్పుగా అందుకున్న జియానా ఆనందానికి హద్దులు లేవు. 

ఈ సందర్భంగా జియానా మాట్లాడుతూ.. ఇంత టిప్పు ఇచ్చిన వ్యక్తి ఈ రెస్టారెంట్‌కి రెగ్యులర్‌ కస్టమర్‌. ఎంతో మంచి మనసుతో నాకు ఇంత భారీ మొత్తాన్ని టిప్పుగా ఇచ్చాడు. దీన్ని నా స్వంత ఖర్చులకు వాడను. ఏదైనా మంచి పని కోసం వినియోగిస్తాను అని తెలిపింది. ప్రస్తుతం ఈ స్టోరి ఫేస్‌బుక్‌లో తెగ వైరలవుతోంది. మహమ్మారి సమయంలో అతడు తన మంచి మనసు చాటుకున్నాడని.. అతడి మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది అంటూ నెటిజనులు సదరు కస్టమర్‌ని ప్రశంసిస్తున్నారు. 

click me!