గాల్లో గుండెపోటు.. విమానసిబ్బంది చేసిన సాహసం.. ఆ ప్రయాడికుడిని ఎలా కాపాడిందంటే....

Published : May 28, 2022, 06:43 AM IST
గాల్లో గుండెపోటు.. విమానసిబ్బంది చేసిన సాహసం.. ఆ ప్రయాడికుడిని ఎలా కాపాడిందంటే....

సారాంశం

విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు. కానీ విమానసిబ్బంది చక్కగా స్పందించి.. అతడిని ప్రాణాపాయస్థితి నుంచి చాకచక్యంగా కాపాడారు. 

ఢిల్లీ : ఓ విమానంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.  Flight గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడికి Heart Attack వచ్చింది.  దీంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన cabin సిబ్బంది అతడి ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు. కన్నూరు నుంచి  దుబాయ్ వెళ్తున్న go first airlinesలో ఈ ఘటన  చోటుచేసుకుంది. యూనస్ రేయాన్ రోత్  అనే వ్యక్తికి గుండెపోటు రాగా… తమ సిబ్బంది సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవడంతో అతడికి ప్రాణాపాయం తప్పినట్లు విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి ఆపద సమయంలో చురుకుగా పనిచేసి, స్పందించిన క్యాబిన్ సిబ్బందికి  నగదు రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

యూనస్ రేయాన్ రోత్ అనే ప్రయాణికుడు.. గో ఫస్ట్ విమానంలో కన్నూరు నుంచి దుబాయ్ వెళ్తున్నాడు. అతడికి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. తోటి ప్రయాణికులంతా help.. help.. అని కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి వెళ్లి అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రయాణికుడిని గుర్తించారు. అతడిలో నాడీ స్పందన లేదు. శ్వాస తీసుకోవడం లేదు. ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా.. ఇతర ప్రయాణికుల సహాయంతో విమానంలో వేరే చోటికి మార్చి కార్డియో పల్మనరీ రీసఫిటేషన్ (సీపీఆర్) ఈ ప్రక్రియను అనుసరించారు.

అదృష్టవశాత్తు డాక్టర్ షబర్ అహ్మద్ అనే వైద్యుడు కూడా అదే విమానంలో ఉండటంతో అతని సహాయం తీసుకున్నారు.  గుండెపోటుకు గురైన వ్యక్తికి ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ (ఏఈడీ) యంత్రంతో షాక్ ఇవ్వడంతో పాటు సీపీఆర్ ప్రక్రియ చేపట్టి అతడిని బతికించారు. ఆ తర్వాత ప్రయాణికుడిని ఆక్సిజన్ పై ఉంచి కోలుకునే స్థితికి తీసుకువచ్చాడు. చివరికి అతడు స్పృహలోకి వచ్చాడు’  అని ఎయిర్ లైన్స్  ఓ ప్రకటనలో తెలిపింది.

అత్యంత ఆపద సమయంలో తమ సిబ్బంది ఎంతో సమర్ధంగా పని చేశారంటూ ఎయిర్లైన్స్ సంస్థ ప్రశంసించింది. వైద్య పరిస్థితిపైఎప్పటికప్పుడు కాక్ పిట్ సిబ్బందికి కూడా అప్డేట్ చేరవేశారు అని తెలిపింది. దుబాయ్ లో విమానం ల్యాండ్ కాగానే యూనస్ చివరకు వీల్ చైర్ పై దిగారని ఎయిర్ లైన్స్ పేర్కొంది. తమ విమానంలో ఎదురైన అత్యవసర పరిస్థితుల్లో వైద్య సాయం అందించిన వైద్యుడికి, ఆ ప్రయాణికుడికి కాంప్లిమెంటరీగా ఉచిత టికెట్లు ఇచ్చింది. తమ విమాన నెట్ వర్క్ లో ఏదైనా దేశీయ లేదా అంతర్జాతీయ ప్రయాణం ఉచితంగా చేసేందుకు అవకాశం కల్పించింది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !