రష్యా: ప్యాసింజర్స్ తో టేకాఫ్... ఆకాశంలో హటాత్తుగా విమానం ఆఛూకీ గల్లంతు

By Arun Kumar PFirst Published Jul 6, 2021, 4:56 PM IST
Highlights

28మందితో బయలుదేరిన ఓ విమానం సముద్రంలో కుప్పకూలిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. 

మాస్కో: ప్రయాణికులతో టేకాఫ్ అయిన విమానం హటాత్తుగా  అదృశ్యమైన సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఫార్‌ ఈస్ట్‌ లోని పెట్రోపవ్లోస్క్‌- కామ్‌చట్‌స్కీ నుంచి పలానాకు ప్రయాణికులను తీసుకుని వెళ్తున్న విమానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కు సంబంధాలు తెగిపోయాయి. షెడ్యూల్‌ ప్రకారం ల్యాండింగ్‌ జరగకపోవడంతో అప్రమత్తమైన అధికారులు దృశ్యమైన విమానం కోసం గాలిస్తున్నారు. ఈ  విమానంలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది వున్నారు. ప్రయాణికుల్లో కొందరు చిన్నారులు కూడా వున్నారు. 

సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానం సముద్రంలో పడిపోయి వుండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. లేదంటే పలానా పట్టణం దగ్గరలోని బొగ్గు గనిలో కూలిపోయి ఉండొచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు  రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్న ప్రాంతాలకు సహాయక బృందాలు  బయలుదేరాయి. 

అయితే గల్లంతయిన విమానం కమ్చట్కా ద్వీపం వద్ద ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న సమయంలో సముద్రంలో కూలిపోయినట్లు రెస్క్యూ అధికారులు చెబుతున్నారు. గమ్యస్థానానికి చేరుకోకముందే ఆకాశంలో వుండగానే ఎయిర్ ట్రాఫిక్ తో సంబంధాలు తెగిపోవడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పైలట్స్ విమానాన్ని ద్వీపంలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించగా ప్రమాదం జరిగింది. 
 

click me!