దక్షిణ ఫ్లోరిడాలో కూలిన భవనం: 24 మంది మృతి, 121 ఆచూకీ గల్లంతు

By narsimha lodeFirst Published Jul 5, 2021, 9:19 PM IST
Highlights

అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో  జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన 121 మంది కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
 

ఫ్లోరిడా:అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో  జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన 121 మంది కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.అయితే ప్రస్తుతం ఉత్తర మియామీ సమీపంలోని 12 అంతస్తుల నివాస భవనంఈ ఏడాది జూన్ 24 తెల్లవారుజామున కూలిపోయింది.ఈ నెల 4న  పాక్షికంగా కూలిపోయిన భవనాన్ని బాంబుల సాయంతో అక్కడి సిబ్బంది కూల్చివేశారు. ఇందుకోసం చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 121 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లు గుర్తించినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా ఈలోపు  ప్రమాదం జరిగింది.  వచ్చే వారంలో ఎల్సా తుపాను వచ్చే అవకాశం ఉండటంతో సర్ఫ్‌సైడ్‌లోని మిగిలిన 12 అంతస్తుల చాంప్లైన్ టవర్స్ సౌత్‌ను అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10:30 తర్వాత కూల్చివేశారు. 
 

click me!