అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరి మృతి

Published : Jul 06, 2021, 09:09 AM IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరి మృతి

సారాంశం

కాలిఫోర్నియాలో.. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

అమెరికాలో తుపాకీ సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తుపాకీ సంస్కృతి కారణంగా కనీసం నెలకి ఒకసారి అయినా.. అక్కడ తుపాకీ చప్పుళ్లు వినపడుతున్నాయి. తాజాగా.. ఇలాంటి సంఘటన మరోటి చోటుచేసుకుంది.  కాలిఫోర్నియాలో.. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దుండుగులు జరిపిన కాల్పుల్లో శాంటా రోసా  ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు గాయపడ్డారు.

గాయపడిన వారిలో 29ఏళ్ల మహిళ, 17ఏళ్ల బాలిక, 16ఏళ్ల బాలుడు ఉన్నారు. అయితే.. వీరు ప్రాణహాని నుంచి బయటపడ్డారని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా.. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే