
వాషింగ్టన్: పశ్చిమ పనామాలో వలసదారులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 39 మంది మృతి చెందారు. అమెరికాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 66 మంది ప్రయాణీకులున్నారు. ఈ ప్రమాదంలో 39 మంది మరణించారు. మరో 20 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
60 మంది ప్రయాణీకులతో వెళ్తున్న సబ్సు ప్రమాదవశాత్తు కొండపైనుండి పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సెంట్రల్ అమెరిలో అత్యంత ఘోరమైన ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. బస్సు కోస్టారికా సరిహద్దులో ఉన్న పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న చిరికి వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
బస్సును ఇద్దరు లైసెన్స్ ఉన్న డ్రైవర్లు నడిపారు. ఈ ఘటనలో ఒక డ్రైవర్ మృతి చెందారు. బస్సులో ఉన్నవారిలో 22 మంది ఈక్వెడార్ కు చెందినవారున్నారని పనామాలోని ఈక్వెడార్ రాయబార కార్యాలయం తెలిపింది. మరో వైపు ఈ బస్సులో ప్రయాణీస్తున్నవారిలో క్యూబా ప్రజలు కూడా ఉన్నారని క్యూబా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ బస్సు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.